న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రోహిత్‌కు అతిపెద్ద బలం అదే.. అందుకే సునాయాసంగా డబుల్ సెంచరీలు చేస్తున్నాడు'

Kamran Akmal says Rohit Sharmas biggest plus point is his power hitting

కరాచీ: ప్రస్తుతం టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సంచలనం. తన అద్భుత బ్యాటింగ్‌తో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ వేదికగా 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో 'హిట్‌మ్యాన్' ఐదు శతకాలతో చెలరేగి ప్రపంచకప్‌ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా ఎవరికీ సాధ్యంకాని చరిత్ర సృష్టించాడు. 2014లో శ్రీలంకపై 264 పరుగులు చేసి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డును తన పేరుపై లికించుకున్నాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ20ల్లో నాలుగు శతకాలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ రోహిత్. అయితే రోహిత్ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం మాత్రం అతడి 'పవర్ హిట్టింగ్' అని పాకిస్థాన్‌ ఆటగాడు కమ్రాన్‌ అక్మల్‌ పేర్కొన్నాడు.

 రోహిత్ బ్యాటింగ్‌ చేస్తుంటే:

రోహిత్ బ్యాటింగ్‌ చేస్తుంటే:

తాజాగా కమ్రాన్‌ అక్మల్ తన యూట్యూబ్ చాట్ షో క్రిక్ కాస్ట్‌లో పాకిస్తాన్ జర్నలిస్ట్ సావేరా పాషాతో మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ అద్భుత ఆటగాడు. నమ్మదగిన బ్యాట్స్‌మన్. అతడు సమయానుకూలంగా, నిబద్ధతతో బ్యాటింగ్‌ చేస్తాడు. రోహిత్ బ్యాటింగ్‌ చేస్తుంటే.. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అతని బ్యాటింగ్ శైలి అంత బాగుంటుంది' అని అన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అక్మల్ ఇప్పటివరకు 53 టెస్టుల్లో, 157 వన్డేల్లో, 58 టీ20 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 11 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు చేశాడు.

అతిపెద్ద బలం అతడి పవర్ హిట్టింగే:

అతిపెద్ద బలం అతడి పవర్ హిట్టింగే:

'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 200, 150 పరుగులు చేయడం చాలా చాలా కష్టం. కానీ రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు బాదాడు. ఇటీవలి ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేశాడు. రోహిత్ బౌండరీలు బాదగలడు, సింగిల్స్ తీయగలడు. రోహిత్‌కు అతిపెద్ద బలం అతడి పవర్ హిట్టింగే. ఆ పవర్ హిట్టింగ్ ద్వారానే భారీ షాట్లు మరియు సిక్సర్లు కొట్టగలడు. రోహిత్‌ బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని చూసి యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవాలి' అని కమ్రాన్‌ అక్మల్ సూచించాడు. రోహిత్ భారత్ తరఫున 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 39 సెంచరీలు చేశాడు.

ధోనీ లాంటి వాళ్లు చాలా అరుదు:

ధోనీ లాంటి వాళ్లు చాలా అరుదు:

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీపై కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు చరిత్రలో ధోనీ లాంటి వికెట్‌కీపింగ్, బ్యాట్స్‌మెన్ మరొకరు లేరని అక్మల్ కొయాడాడు. 'కెన్యాలో పాకిస్తాన్- ఏపై ఎలాగైతే కెరీర్ ప్రారంభించాడో.. చివరి వరకూ అలాగే కొనసాగాడు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలా ధోనీ కెప్టెన్సీలో ఎన్నో ఘనతలు ఉన్నాయి' అని అక్మల్ తెలిపాడు. ధోనీ లాంటి వాళ్లు క్రికెట్లోకి రావడం చాలా అరుదని పేర్కొన్నాడు.

 స్వల్పకాలిక లక్ష్యాల మీదే దృష్టిపెడతా

స్వల్పకాలిక లక్ష్యాల మీదే దృష్టిపెడతా

'హిట్‌మ్యాన్' రోహిత్ శ‌ర్మ తన బ్యాటింగ్ విజయ సూత్రాన్ని గతంలో వెల్లడించాడు. '‌దీర్ఘకాలిక లక్ష్యాలు పెద్దగా ఫలితాలివ్వవని నా సుదీర్ఘ కెరీర్‌ ద్వారా అర్థమైంది. అంతేకాదు వాటివల్ల ఒత్తిడి కూడా ఏర్పడుతుందని గ్రహించా. అందుకే నేను ఎప్పుడూ స్వల్పకాలిక లక్ష్యాల మీదే దృష్టిపెడతా. ఎప్పుడూ రెండు, మూడు నెలల్లో జరిగే కొన్ని మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకునే సన్నద్ధమవుతుంటా. మనం ఎవరితో ఆడతాం, నేను అత్యుత్తమంగా ఏం చేయగలను అని ఆలోచిస్తా. ప్రతి సిరీస్‌ లేదా టోర్నమెంట్‌ కోసం లక్ష్యాలను పెట్టుకోవడం నాకు చాలా సాయం చేస్తున్నది. ఈ విధానం ఎంతో ఉత్తమం, ఉపయుక్తంగా కూడా ఉంటుంది' అని హిట్‌మ్యాన్ తెలిపాడు.

ఓపెనర్‌గా ప్రమోషన్ రావడంతో:

ఓపెనర్‌గా ప్రమోషన్ రావడంతో:

వాస్తవానికి 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాలోనూ ఉన్నాడు. కానీ 2011 వన్డే ప్రపంచకప్‌‌లో మాత్రం చోటుదక్కించుకోలేకపోయాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. ప్రపంచకప్ టీమ్‌లో అవకాశం రాకపోవడం తనను చాలా వేధించిన రోహిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్.. ఎంఎస్ ధోనీ ఓపెనర్‌గా ప్రమోషన్ రావడంతో రోహిత్‌కు తిరుగులేకుండా పోయింది.

'పంత్‌లో టాలెంట్‌కు కొదవలేదు.. కానీ కాస్త టెంపరితనం తగ్గించుకోవాలి'

Story first published: Monday, July 20, 2020, 14:43 [IST]
Other articles published on Jul 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X