Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'పంత్‌లో టాలెంట్‌కు కొదవలేదు.. కానీ కాస్త టెంపరితనం తగ్గించుకోవాలి'

A talent getting wasted: Former cricketer Kirti Azad on Rishabh Pant

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి వారసుడిగా అందరూ అనుకున్న రిషబ్ పంత్‌ స్థాయికి తగ్గట్టు రాణించలేక జట్టులో చోటు ప్రశ్నార్థకం చేసుకున్నాడు. పరిమిత ఓవర్లలో లోకేష్ రాహుల్ నుంచి తీవ్ర పోటీ ఎదురుకాగా.. టెస్టులో వృద్దిమాన్ సహా నుంచి గట్టి పోటీ ఉంది. మహీ వారసుడిగా కీపింగ్‌ బాధ్యతలు అందుకుని ఆందుకు తగ్గట్టుగానే ఆరంభంలో మెరిసిన యువ వికెట్‌ కీపర్‌ పంత్‌కు ఇప్పుడు అవకాశాలు కోసం వేచి చూసే పరిస్థితి వచ్చింది. పంత్‌ వైపు టీమిండియా యాజమాన్యం, సెలక్టర్లు చూడటం లేదు. గతంలో వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చిన సెలక్టర్లు.. అతని పేరును కూడా మర్చిపోయారు. అయితే పంత్ ఈ పరిస్థితి తెచ్చుకోవడానికి కారణం మాత్రం అతడే అని మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ అన్నారు.

పంత్‌లో టాలెంట్‌కు కొదవలేదు:

పంత్‌లో టాలెంట్‌కు కొదవలేదు:

తాజాగా కీర్తి ఆజాద్‌ స్పోర్ట్స్ ‌కీడాతో మాట్లాడుతూ... 'రిషబ్ పంత్‌లో టాలెంట్‌కు కొదవలేదు. కానీ కాస్త టెంపరితనం తగ్గింకుంటే బాగుంటుంది. తన మెదడు, ఆలోచనలను సరైన మార్గంలో ఉండేలా చూసుకోవాలి. పంత్‌ హఠాత్తుగా తన బ్యాటింగ్‌ను మార్చుకుంటాడు. ప్రతీ బంతిని బౌండరీ బాధలనుకోవడం అతని చేటు చేస్తోంది. వన్డే, టెస్టు ఫార్మాట్ల‌ను కూడా టీ20 తరహాలో ఆడాలంటే ఎలా సాధ్యం. ఇదే పంత్‌ మార్చుకోవాల్సి ఉంది. పంత్‌ను పక్కన కూర్చోబెట్టడంతో అతని టాలెంట్‌ వృథా అవుతుందనే చెప్పాలి. వికెట్‌ దగ్గర నిలబడటం నేర్చుకుంటే.. పరుగులు అవే వస్తాయి. ముందుగా స్టైక్‌ రోటేట్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. క్రీజులో కుదురుకున్నాక షాట్లు ఆడితే బాగుంటుంది' అని అన్నారు.

‌కీపర్‌గా కంటే బ్యాట్స్‌మన్‌గానే:

‌కీపర్‌గా కంటే బ్యాట్స్‌మన్‌గానే:

'రిషబ్ పంత్‌ కీపర్‌గా కంటే బ్యాట్స్‌మన్‌గాను మెరుగ్గా ఉన్నాడు. అయినా పూర్తి స్థాయి టాలెంట్‌ను అతడు బయటకు తీయలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాల్లో అనవరసర తప్పిదాలు చేసి ఇప్పుడు చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. పంత్‌కు‌ మళ్లీ కచ్చితంగా అవకాశం ఇచ్చి చూడాలి. అతనికి ప్రత్యేకంగా ఒక స్థానాన్ని కూడా సెట్‌ చేస్తే మంచిది. పంత్‌ టాలెంట్‌ వేస్ట్‌ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది' అని కీర్తి ఆజాద్‌ పేర్కొన్నారు. కీర్తి ఆజాద్ భారత్ తరఫున 7 టెస్టులు, 25 వన్డేలు ఆడారు. 32 మ్యాచుల్లో ‌ఆజాద్ ఒక అర్ధ సెంచరీ కూడా చేయలేదు.

నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్:

నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్:

కరోనా దెబ్బకు ఇళ్లకు పరిమితమైన భారత క్రికెటర్లు.. ఒక్కొక్కరుగా ఔట్ డోర్ ప్రాక్టీస్ మొదలుపెడుతున్నారు. రిషభ్ పంత్, సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా తాజాగా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ఇద్దరు కలిసి ఘజియాబాద్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న నెట్స్‌లో చెమటోడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలను రైనా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బ్యాటింగ్‌కు సంబంధించి పంత్‌కు రైనా సూచనలివ్వడం అందులో కనిపించింది. ఘజియాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రైనా చాలా రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇతనికి కొద్ది రోజుల క్రితం పంత్ జత కలిశాడు.

13 టెస్టులు, 16 వన్డేలు, 28 టీ20లు:

13 టెస్టులు, 16 వన్డేలు, 28 టీ20లు:

ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్వహించిన తాజా ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో రిషబ్ పంత్‌ మాట్లాడుతూ... 'నా ఫేవ‌రెట్ బ్యాటింగ్ పార్ట్‌న‌ర్ ఎంఎస్‌ ధోనీ. కానీ అతడితో కలిసి ఆడే అవకాశాలు అరుదుగా దొరుకుతాయి. ఒకవేళ మహీ గనక క్రీజులో ఉంటే అంతా సర్దుకుంటుంది. అతడో ప్రణాళిక ఇస్తాడు, దానిని అనుసరిస్తే చాలు. ఛేదనల్లో మహీ పనితీరు అద్భుతం' అని అన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో పంత్ ఇప్పటివరకు 13 టెస్టుల్లో, 16 వన్డేల్లో, 28 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

మా నాన్న అబద్ధం చెబుతున్నారని బాయ్‌కాట్ ‌అన్నాడు.. చాలా కోపం వచ్చింది: సైఫ్అలీ ఖాన్‌‌

Story first published: Monday, July 20, 2020, 13:29 [IST]
Other articles published on Jul 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+