న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kamran Akmal: యూఏఈలో టీ20 ప్రపంచకప్.. పాక్‌కు అడ్వాంటేజ్.. ఆ పసికూనతో కూడా ప్రమాదమే!

Kamran Akmal picks three teams as favourites for the T20 World Cup 2021
T20 World Cup set to begin on October 17 in UAE; final on November 14 | Oneindia Telugu

కరాచీ: యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తే పాకిస్థాన్‌కు అడ్వాంటేజ్ అవుతుందని ఆ జట్టు సీనియర్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు. గత కొన్నేళ్లుగా యూఏఈని సొంత వేదికగా చేసుకుని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న పాక్‌కు ఇది కలిసొచ్చే అంశమని అక్మల్ అభిప్రాయపడ్డాడు. కరోనా నేపథ్యంలో భారత్ వేదికగా నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆటగాళ్ల, నిర్వహకుల ఆరోగ్య సంక్షేమం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఇప్పటికే ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ)కు కూడా తెలియజేసింది.

పాక్‌కు అడ్వాంటేజ్..

పాక్‌కు అడ్వాంటేజ్..

ఇక యూఈఏ వేదికగా టీ20 ప్రపంచకప్ జరిగితే పాక్‌తో పాటు మరో రెండు జట్లకు కలిసొస్తుందని కమ్రాన్ అక్మల్ తెలిపాడు. తాజాగా హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వెటరన్ వికెట్ కీపర్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. పసికూన అప్గానిస్థాన్‌తో కూడా ఇతర జట్లకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు.

'యూఏఈ వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ జరగడం పాకిస్థాన్‌కు బాగా కలిసొచ్చే అంశం. ఎందుకంటే.. మేం గత 9-10 ఏళ్లుగా యూఏఈ వేదికగానే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడుతున్నాం. అంతేకాకుండా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ఆరంభ సీజన్లతో పాటు ఈ సీజన్ సెకండాఫ్ మ్యాచ్‌లు అక్కడే జరిగాయి. దాంతో మిగిలిన జట్లతో పోలిస్తే యూఏఈ పిచ్‌లపై పాకిస్థాన్‌ టీమ్‌కే ఎక్కువ అనుభవం ఉంది'అని కమ్రాన్ అక్మల్ వెల్లడించాడు.

అఫ్గాన్‌తో డేంజర్..

అఫ్గాన్‌తో డేంజర్..

ఐపీఎల్ 2020 సీజన్‌తో పాటు ఈ సీజన్ సీజన్ సెకండాఫ్ మ్యాచ్‌లు అక్కడే జరగనున్నాయి. పాకిస్థాన్‌తో పాటు భారత ఆటగాళ్లకు యూఏఈ పిచ్‌లపై మంచి అవగాహన ఉందని అక్మల్ తెలిపాడు. ఇక ఈ పిచ్‌లపై అఫ్గానిస్థాన్‌కు మంచి పట్టుందని, వారి ఆరంభ క్రికెట్ మొత్తం ఇక్కడే సాగిందని అక్మల్ గుర్తు చేశాడు. రాబోయే వరల్డ్ కప్‌లో ఆ జట్టు ప్రమాదకరంగా మారుతుందనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదన్నాడు. ఇక పీఎస్‌ఎల్, ఐపీఎల్ అనుభవంతో ఇతర దేశ ఆటగాళ్లకు కూడా కాస్తో కూస్తో పిచ్‌లపై అవగాహన ఉండే అవకాశం ఉందన్నాడు.

ఇప్పుడే చెప్పలేం..

ఇప్పుడే చెప్పలేం..

'భారత్, పాకిస్థాన్ ప్లేయర్లే కాకుండా.. ఇతర ఆటగాళ్లకు కూడా యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ నిర్వహించడం అడ్వాంటేజ్ కానుంది. ఎందుకంటే చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్, పీఎస్‌ఎల్‌లో ఈ పిచ్‌లపై ఆడిన వాళ్లే. యూఏఈ పరిస్థితులపై అఫ్గానిస్థాన్ ప్రమాదకరంగా జట్టుగా మారవచ్చు. వారి జట్టులోని ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్ ఎవరో చెప్పడం కష్టమే.'అని అక్మల్ చెప్పుకొచ్చాడు.

2009 ఉగ్రదాడి..

2009 ఉగ్రదాడి..

2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్‌లో ఉగ్రవాదులు దాడికి దిగారు. విచక్షణారహితంగా వారు జరిపిన కాల్పుల్లో శ్రీలంక క్రికెటర్లు గాయపడ్డారు. ఇక అప్పటి నుంచి ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు కూడా పాక్‌లో పర్యటించే సాహసం చేయడం లేదు. దాంతో.. యూఏఈని సొంత వేదికగా చేసుకున్న పాకిస్థాన్.. అక్కడే ఇంటర్నేషనల్ సిరీస్‌లు ఆడుతోంది. గతేడాది శ్రీలంక, సౌతాఫ్రికా పర్యటించినప్పటికీ.. కరోనా కారణంగా పీఎస్‌ఎల్‌ను యూఏఈకి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Story first published: Tuesday, June 29, 2021, 15:40 [IST]
Other articles published on Jun 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X