న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెస్ట్ వికెట్ కీపర్‌గా కమ్రాన్ అక్మల్: సోమీలో నెటిజన్ల జోకులు

By Nageshwara Rao
Kamran Akmal becomes the butt of all jokes after winning Best Wicket-Keeper award

హైదరాబాద్: పాకిస్తాన్‌ వెటరన్ క్రికెటర్ కమ్రాన్‌ అక్మల్‌పై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌లో 2017-18లో అద్బుత ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) బుధవారం అవార్డులు ప్రకటించింది.

పీఎస్ఎల్: సరికొత్త రికార్డు సృష్టించిన కమ్రాన్ అక్మల్ (వీడియో)పీఎస్ఎల్: సరికొత్త రికార్డు సృష్టించిన కమ్రాన్ అక్మల్ (వీడియో)

దేశవాళీ క్రికెట్‌లో భాగంగా బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ అవార్డు కమ్రాన్‌ అక్మల్‌ను వరించింది. అయితే కమ్రాన్‌ అక్మల్ బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ ఏంటీ? అంటూ నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. గత కొంతకాలంగా కమ్రాన్ అక్మల్‌పై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతూనే ఉన్నాయి.

అందుకు కారణం లేకపోలేదు. వివాదాల కారణంగా తన అంతర్జాతీయ క్రికెట్ సవ్యంగా సాగడం లేదు. వికెట్ కీపింగ్‌లో తప్పిదాల వల్లే అతడు పాకిస్థాన్ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు అక్మల్‌కు బెస్ట్ వికెట్ కీపర్ అవార్డు ప్రకటించడంతో నెటిజన్లు జోకులు పేల్చారు.

'నేను విన్నది నిజమా? జోక్‌ చేయకురబ్బా..' అని ఒకరు కామెంట్‌ చేయగా.. బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ అక్మల్‌ దక్కిందంటే.. మన డొమెస్టిక్‌ క్రికెట్‌ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందని మరొకరు కామెంట్‌ చేశారు. ఇంత చెత్త ఆటగాడు బెస్ట్‌ కీపర్‌ అయితే పాక్‌లో వికెట్‌ కీపర్‌ల కొరత ఉన్నట్లేనని మరొక నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్: కమ్రాన్ అక్మల్ రికార్డు బద్దలు కొట్టిన ధోనిటీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్: కమ్రాన్ అక్మల్ రికార్డు బద్దలు కొట్టిన ధోని

నిజానికి కమ్రాన్ అక్మల్ వికెట్ కీపింగ్‌లో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం పాకిస్థాన్‌కు పలు విజయాలను కట్టబెట్టాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2018 సీజన్‌లో కీలకఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2017లో వెస్టిండిస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చివరిసారిగా పాక్ జాతీయ జట్టు తరుపున ఆడాడు.

పాక్ క్రికెట్ బోర్డు భారత్‌ను చూసి నేర్చుకోవాలిపాక్ క్రికెట్ బోర్డు భారత్‌ను చూసి నేర్చుకోవాలి

మరోవైపు ఇటీవల జింబాబ్వే జట్టుపై డబుల్‌ సెంచరీ సాధించిన యువ క్రికెటర్ ఫకార్‌ జమాన్‌కు 2.5 మిలియన్ల పాకిస్థాన్ రూపాయలతో ప్రత్యేక అవార్డును అందజేశారు. బెస్ట్‌ టెస్ట్‌ ప్లేయర్‌గా మహమ్మద్‌ అబ్బాస్‌, వన్డే ప్లేయర్‌గా హసన్‌ అలీలు అవార్డులు అందుకున్నారు.

Story first published: Friday, August 10, 2018, 13:34 [IST]
Other articles published on Aug 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X