ఐదో వన్డేలో అతి చేసిన రబాడ: జరిమానా విధించిన ఐసీసీ (వీడియో)

Posted By: Subhan
Kagiso Rabada fined 15% of match fee, slapped with a demerit point

హైదరాబాద్: ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఐదో వన్డేలోనూ విజయం సాధించి 4-1 సిరీస్‌ను సాధించింది. మ్యాచ్ ఎలా గెలవాలనే తపన.. దానికి మించి ఓపెనర్ స్టార్ బ్యాట్స్‌మెన్‌ను ఓడించాలనే కసి రెండూ కలిపి రబాడ ఫీజుకు కోత తెచ్చి పెట్టాయి.

ఐదో వన్డే మ్యాచ్‌లో క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించినందుకు ఐసీసీ రబాడకు 15% ఫీజును జరిమానాగా కట్టమని ఆజ్ఞలు జారీ చేసింది. ఈ ఒక్క మ్యాచ్‌నే కాదు క్రితం మ్యాచ్ లలో సైతం అతని ప్రవర్తనను పరిగణనలోకి తీసుకునే ఈ జరిమానాను విధించింది. సాధారణంగా ఎనిమిది డీ మెరిట్ పాయింట్లు దాటితే మ్యాచ్ సస్పెన్షన్ ఉంటుంది. కానీ, ఇంకా ఐదు పాయింట్ల దగ్గరే ఆగిపోవడంతో అతనికి జరిమానాతో వదిలిపెట్టింది.

ఇది మొదటి సారేం కాదు:
2017 ఫిబ్రవరి 8న దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒకటి, 2017 జూలై 7 దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు రెండోది ఇలా రబాడ అకౌంట్లో డీ మెరిట్ పాయింట్లు వచ్చి చేరాయి. ఐదో వన్డేలో ధావన్ అవుట్ అవగానే అతని వైపు చేతితో సైగ చేసి, పద జాలం ఉపయోగించి మీరీ దూషించడంతో అతని ఖాతాలో ఐదు డీ మెరిట్ పాయింట్లు వచ్చి చేరాయి.

గత ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న రబాడ ఆ తర్వాత అదే ఏడాది జులైలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో మరో పాయింట్‌ను జత చేసుకున్నాడు. నాలుగు డీమెరిట్‌ పాయింట్లతో రబాడ ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. ఒకవేళ 24 నెలల వ్యవధిలో రబాడ ఎనిమిది డీమెరిట్‌ పాయింట్లను చేరుకుంటే రెండు టెస్టులు లేదా ఒక టెస్టు రెండు వన్డే/టీ20లు లేదా నాలుగు వన్డే/టీ20ల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అయితే ఐదో వన్డేలో తన నేరాన్ని ఒప్పుకోవడంతో రబాడపై ఎటువంటి విచారణ జరపకుండానే నాలుగో అంపైర్ బొంగనీ జిలె ఐసీసీ ఆర్టికల్ 2.1.7 ప్రకారం జరిమానాతో సరిపెట్టాడు.

Story first published: Wednesday, February 14, 2018, 17:54 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి