న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్ ఎడ్జిబాస్టన్ ఇన్నింగ్స్‌ కోహ్లీని మించి: ఆసీస్ కోచ్ ప్రశంసల వర్షం

Justin Langer Rates Steve Smith Above Virat Kohli After Edgbaston Match || Oneindia Telugu
 Justin Langer rates Steve Smith above Virat Kohli after Edgbaston exploits

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మించి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రదర్శన ఉందని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

<strong>లార్డ్స్ టెస్టుకు జిమ్మీ దూరం: ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్ తగిలింది</strong>లార్డ్స్ టెస్టుకు జిమ్మీ దూరం: ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్ తగిలింది

బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత స్టీవ్ స్మిత్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లాండ్ అభిమానులు తనను ఎగతాళి చేస్తున్నా... పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయి రెండు ఇన్నింగ్స్‌లోనూ 140కి పైగా పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్మిత్‌

తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్మిత్‌

తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్మిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 142 పరుగులతో చెలరేగాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో పోయిన పరువుని దక్కించుకోవడంతో పాటు ఆసీస్ జట్టులో తన స్థానానికి తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌పై ఆసీస్‌ కోచ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

కోహ్లీ వంటి గొప్ప ఆటగాడిని ఎప్పుడూ చూడలేదు

కోహ్లీ వంటి గొప్ప ఆటగాడిని ఎప్పుడూ చూడలేదు

"వేసవికాలంలో కోహ్లీ వంటి గొప్ప ఆటగాడిని ఎప్పుడూ చూడలేదన్నాను. కానీ స్మిత్‌ తాజా ఇన్నింగ్స్‌ ఆ స్థాయికి మించి ఉంది. సమకాలిన క్రికెట్‌లో ఒత్తిడిని జయిస్తూ 60 సగటుతో ఆడే స్మిత్‌లాంటి ఆటగాడిని ఇప్పటి వరకు చూసుండరు. ఇది కేవలం అతని నైపుణ్యం మాత్రమే కాదు" అని జస్టిన్ లాంగర్ అన్నాడు.

మెంటల్ స్టామినా వల్లే ఇది సాధ్యం

మెంటల్ స్టామినా వల్లే ఇది సాధ్యం

"అపారమైన సాహసం, విశాలమైన వ్యక్తిత్వం, ధైర్యం, మొక్కవోని దీక్ష, శారీరక ధృడత్వం, మెంటల్ స్టామినా వల్లే ఇది సాధ్యమైంది" అని స్టీవ్ స్మిత్‌పై లాంగర్ ప్రశసంల వర్షం కురిపించాడు. తొలి టెస్టులో రెండు సెంచరీలు సాధించడంతో స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 25 టెస్టు సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్‌ నిలిచాడు.

యాషెస్: జాక్వస్ కల్లిస్ బ్యాటింగ్ రికార్డుని సమం చేసిన స్టీవ్ స్మిత్

బ్రాడ్‌మన్‌ తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో

బ్రాడ్‌మన్‌ తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో

ఈ క్రమంలో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం సర్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 25వ టెస్టు సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో సైతం స్టీవ్ స్మిత్ తన స్థానాన్ని మరింతగా మెరుగుపరచుకున్నాడు. ఈ మ్యాచ్‌కి ముందు 857 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న స్మిత్.. ప్రస్తుతం 900 పాయింట్ల సాధించి ఛతేశ్వర్ పుజారాను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు.

Story first published: Tuesday, August 6, 2019, 19:06 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X