యాషెస్: జాక్వస్ కల్లిస్ బ్యాటింగ్ రికార్డుని సమం చేసిన స్టీవ్ స్మిత్

హైదరాబాద్: స్టీవ్ స్మిత్‌పై ప్రస్తుతం మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లాండ్ అభిమానులు తనను ఎగతాళి చేస్తున్నా... పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయి రెండు సెంచరీలు సాధించాడు.
తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించి... ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియాకు శుభారంభాన్నిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేసిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లో 142 పరుగులతో చెలరేగాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో పోయిన పరువుని దక్కించుకోవడంతో పాటు ఆసీస్ జట్టులో తన స్థానానికి తిరుగులేదని నిరూపించుకున్నాడు.

ఎడ్జిబాస్టన్ టెస్టులో రెండు సెంచరీలు
ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు సెంచరీలు సాధించడంతో స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 25 టెస్టు సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ నిలిచాడు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం సర్ బ్రాడ్‌మన్ తర్వాత అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 25వ టెస్టు సెంచరీని సాధించాడు.
యాషెస్ సిరీస్: స్మిత్ బాగా ఆడాడు.. పునరాగమనం అద్భుతం

కోహ్లీని సైతం వెనక్కినెట్టిన స్టీవ్ స్మిత్
అదే సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని సైతం స్టీవ్ స్మిత్ వెనక్కినెట్టాడు. దీంతో పాటు ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ పైగా పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వస్ కల్లిస్ సరసన స్టీవ్ స్మిత్ నిలిచాడు.

ఒక టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో పాటు హాఫ్ సెంచరీలు
ఇప్పటివరకూ ఒక టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో పాటు హాఫ్ సెంచరీలను సఫారీ మాజీ క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ తొమ్మిది సందర్భాల్లో చేయగా... ఇప్పడు స్టీవ్ స్మిత్ సైతం జాక్వస్ కల్లిస్ రికార్డుని సమం చేశాడు. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో అలెస్టర్ కుక్(ఇంగ్లండ్) ఎనిమిది సందర్భాల్లో ఈ ఘనత సాధించి రెండో స్థానంలో నిలిచాడు.
నువ్వు నిజమైన చాంపియన్: డేల్ స్టెయిన్ రిటైర్మెంట్‌పై కోహ్లీ

బాల్ టాంపరింగ్‌తో ఏడాది పాటు క్రికెట్‌కు దూరం
ఇక, అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ(భారత్), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా), కుమార సంగక్కర(శ్రీలంక), సచిన్ టెండూల్కర్( భారత్)లు ఏడేసి సార్లు ఈ ఘతన సాధించి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. డాన్ బ్రాడ్‌మన్‌తో పోలిస్తే స్టీవ్ స్మిత్ తన కెరీర్‌లో ఎంతో అమూల్యమైన ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications