న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ క్రికెట్ ఎన్నికల్లో.. అధ్యక్షుడిగా జర్నలిస్టు రజత్ శర్మ

Journalist Rajat Sharma is new DDCA boss

హైదరాబాద్: డీడీసీఏ (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ ఎన్నికయ్యారు. టీమిండియా మాజీ క్రికెటర్, 1984లో ప్రపంచకప్ సాధించిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన మదన్ లాల్‌పై ఆయన 517 ఓట్లతో గెలుపొందడం విశేషం. రజత్ శర్మకు మొత్తం 1521 ఓట్లు పోలవ్వగా, మదన్ లాల్‌కు 1004 ఓట్లు వచ్చాయి.

అధికార బీజేపీ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన రజత్ శర్మ.. అధ్యక్ష పదవి రేసులో ఆది నుంచే పైచేయి కనబరిచారు. అందుకుతగ్గట్లే సంపూర్ణ మెజార్టీ దక్కించుకోవడంతో ఇప్పుడు డీడీసీఏలో ఆయన స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగింది.

డీడీసీఏ ఉపాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సతీమణికి చుక్కెదురైంది. 1364 ఓట్లతో ఆమెపై రాకేశ్ కుమార్ బన్సాల్ విజయం సాధించారు. ఈయన డీడీసీఏ మాజీ ప్రెసిడెంట్ స్నేహ్ బన్సాల్‌కు సోదరుడు కావడం గమనార్హం. తాజా ఓటమితో డీడీసీఏలో సీకే ఖన్నా ప్రస్థానానికి ముగింపు పడినట్లైంది. సుమారు మూడు దశాబ్దాలుగా ఏదో రూపంలో ఆయన డీడీసీఏలో అధికారంలో ఉన్నారు.

సోమవారం వెల్లడించిన డీడీసీఏ ఫలితాల్లో రజత్ శర్మ వర్గం మొత్తం పన్నెండింటికి 12 స్థానాలను కైవసం చేసుకొని సత్తా చాటారు. ఈ ఎన్నికల బరిలో నిలిచిన మరో ఇద్దరు ప్రముఖులు.. వికాస్ సింగ్‌, రవి గుప్తా వరసగా 232, 26 ఓట్లతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

Story first published: Monday, July 2, 2018, 16:49 [IST]
Other articles published on Jul 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X