న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లాండ్‌ సరికొత్త రికార్డు

By Nageshwara Rao
Jos Buttler century saves England to complete historic whitewash over Australia

హైదరాబాద్: తమ వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లాండ్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన చివరిదైన ఐదో వన్డేలో బట్లర్‌ (110 నాటౌట్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటంతో ఇంగ్లాండ్‌ వికెట్‌ తేడాతో గెలుపొందింది.

England Set New Record For The Highest ODI Total

206 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆ జట్టు 48.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒకానొక దశలో ఇంగ్లండ్‌ 114 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. దీంతో ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తొమ్మిదో వికెట్‌కు బట్లర్, రషీద్‌ జోడి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

 ఆస్ట్రేలియా 34.4 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌట్

ఆస్ట్రేలియా 34.4 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌట్

రషీద్‌ ఔటయ్యాక జేక్‌ బాల్‌ (1 నాటౌట్‌)తో కలిసి బట్లర్‌ జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 34.4 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (22), ట్రావిస్ హెడ్ (56) తొలి వికెట్‌కు 6.3 ఓవర్లోనే 61 పరుగులు జోడించారు.

ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టిన మొయిన్ అలీ

ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టిన మొయిన్ అలీ

ఆ తర్వాత మూడు బంతుల్లో ఫించ్, స్టోయినిస్‌ను పెవిలియన్ చేర్చిన మొయిన్ అలీ ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత వెనువెంటనే వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 100 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీ (44), డార్సీ షార్ట్ (47 నాటౌట్) రాణించడంతో 205 పరుగులైనా చేయగలిగింది.

114 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

114 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీకి నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో 114 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును జాస్ బట్లర్ (122 బంతుల్లో 110 నాటౌట్), అదిల్ రషీద్ (47 బంతుల్లో 20) ఆదుకున్నారు.

0-5తో ఓటమిపాలైన ఆస్ట్రేలియా

0-5తో ఓటమిపాలైన ఆస్ట్రేలియా

దీంతో ఇంగ్లాండ్ చివరి వికెట్‌కు విజయాన్ని సాధించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేల సిరీస్‌ను 0-5తో ఓడిపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా ఐదు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవడం ఇది రెండోసారి. 2016 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా 5-0 తేడాతో చిత్తుగా ఓడించింది. వన్డే సిరీస్‌ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేయడం కూడా ఇది రెండోసారి కావడం విశేషం. 2001లో జింబాబ్వేపై ఇంగ్లాండ్ జట్టు 5-0 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Story first published: Monday, June 25, 2018, 17:07 [IST]
Other articles published on Jun 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X