న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ రేసులో 'జాంటీ రోడ్స్‌'

Jonty Rhodes Applies For Position Of Team India’s Fielding Coach || Oneindia Telugu
Jonty Rhodes applies for position of Team Indias fielding coach

ముంబై: దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌, దిగ్గజ ఫీల్డర్‌ జాంటీ రోడ్స్‌ టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టీమిండియా సహాయ సిబ్బంది రేసులో జాంటీ రోడ్స్‌ చేరిపోయారు. ఇప్పటికే హెడ్ కోచ్‌ పదవికి శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళా జయవర్దనే దరఖాస్తు చేసేందుకు ఇష్టంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. దిగ్గజ ఆటగాళ్లు టీమిండియాకు పనిచేయాలనుకోవడంతో పోటీ రసవత్తరంగా మారనుంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

జులై 30 వరకు గడువు:

జులై 30 వరకు గడువు:

ప్రస్తతం ఉన్న టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి అందరూ వెస్టిండీస్ పర్యటన అనంతరం వైదొలగనున్నారు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కొత్తగా వయసుతో పాటు అనుభవాన్ని కొలమానంగా తీసుకోవాలంటూ కొత్త నిబంధనలను విధించింది. ఆసక్తి కలిగిన అభ్యర్దులు జులై 30 సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ పేర్కొంది. కొత్త కోచ్‌ని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్ అడ్వైజయిరీ కమిటీ ఎంపిక చేయనుంది.

భారత్‌కు ఏదన్న చేయాలి:

భారత్‌కు ఏదన్న చేయాలి:

దరఖాస్తులకు సమయం దగ్గరపడుతుండడంతో అందరూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జాంటీ రోడ్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. 'నా భార్య, నేను భారత్‌ను ఎంతగానో ప్రేమిస్తాం. భారత్ మాకెంతో ఇచ్చింది. నా ఇద్దరు పిల్లలు కూడా భారత్‌లోనే జన్మించారు. నేను ముంబై జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా 9 సీజన్లు పనిచేశా. గత 5 సంవత్సరాలుగా భారత దేశంలో అథ్లెటిజం, ఫీల్డింగ్ సామర్థ్యంలో అద్భుతమైన వృద్ధిని చూశా. ఇది సాధించినందుకు నిజంగా గర్వంగా ఉంది. భారత్‌కు నా వంతుగా ఏదన్న చేయాలని దరఖాస్తు చేశా' అని జాంటీ పేర్కొన్నారు.

సొంత దేశానికే ఫీల్డింగ్‌ కోచ్‌గా:

సొంత దేశానికే ఫీల్డింగ్‌ కోచ్‌గా:

ముంబై ఇండియన్స్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేయడం.. భారత సంస్కృతి, సంప్రదాయాలంటే ప్రత్యేక అభిమానం ఉండడం ఈ పదవి జాంటీకే దక్కే అవకాశం ఉంది. 1992 నుంచి 2003 వరకు దక్షిణాఫ్రికాకు ఆడిన జాంటీ.. 8000కు పైగా పరుగులు చేసారు. 52 టెస్టులు, 245 వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించారు. రిటైర్మెంట్ అనంతరం సొంత దేశానికే ఫీల్డింగ్‌ కోచ్‌గా పని చేసారు. కెన్యాకూ కోచ్‌గా పనిచేశారు.

Story first published: Thursday, July 25, 2019, 10:19 [IST]
Other articles published on Jul 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X