న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2019 ప్రపంచకప్ ఫైనల్ సూపర్ ఓవర్లో ఇయాన్ మోర్గన్ చెప్పిన ఆ విషయం ఇప్పటికీ గుర్తొస్తుంది : జోఫ్రా ఆర్చర్

Jofra Archer Reminded the conversation with Morgan during super Over in 2019 World cup Final

ఇయాన్ మోర్గన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అతనికి భావోద్వేగపూరితంగా సెండ్ ఆఫ్ ఇచ్చాడు. 2019 ప్రపంచకప్‌ ఇంగ్లాండ్ గెలవడానికి ఇయాన్ మోర్గన్ మాస్టర్‌క్లాస్ కెప్టెన్సీ ఎలా సహాయపడిందో కూడా తెలిపాడు. మోర్గన్ రిటైర్మెంట్‌ను ఊహించలేదని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ టైంలో ఆర్చర్ 11ఇన్నింగ్స్‌లలో 20వికెట్లు పడగొట్టి కీలక ప్రదర్శన కనబరిచాడు. న్యూజిలాండ్‌పై ఫైనల్లో విజయం సాధించడంలో కీలకమైన సూపర్ ఓవర్‌ వేసి డిఫెండ్ చేయగలిగాడు. .

'అది 2019 ప్రపంచకప్‌ టైం. లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో నేను సూపర్ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాను. ఆట చివరకు వచ్చింది. న్యూజిలాండ్ గెలవడానికి రెండు బంతుల్లో మూడు పరుగులే కావాలి. అప్పుడొచ్చాడు.. ఇయాన్ నా దగ్గరికి. ఆర్చ్ ఇది మనకొక గ్యాంబుల్ టైం. వికెట్ అయినా తీయాలి లేదా డాట్ బాల్ అయినా వేయాలి. మనం ఏమి చేద్దాం అంటూ అడిగాడు. నేను బౌన్సర్ వేయాలనుకుంటున్నాను అని అతనితో చెప్పాను. నువ్వు వర్కవుట్ అవుతుందని ష్యూర్‌గా ఉన్నావా అని నన్ను అడిగాడు. నేను 'అవును' అన్నాను. సరే అయితే.. అందుకు తగ్గట్టు ఎలా ఫీల్డింగ్ సెట్ చేద్దాం అంటూ నా వెన్నుతట్టాడు. నేను ఎలా వేయాలో మాత్రం అతను చెప్పలేదు.

నా ప్రమేయానికే వదిలేశాడు. ఆ బంతికి కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. తర్వాత బంతికి రనౌట్ కావడం వల్ల మేం గెలుపొందాం. నా జీవితంలోనే గొప్ప క్షణాలవి. అతను ఆ టైంలో నా మీద నమ్మకముంచడం నిజంగా ఇప్పటికీ నాకో రివైండ్ థింగే.. అతనికి అందుకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అలాగే నేను వరల్డ్ కప్ జట్టులోకి వచ్చేముందు చాలా మంది జట్టును మార్చొద్దు అని మంకుపట్టు పట్టినా.. తాను మాత్రం నా మీద నమ్మకముంచాడు. కెప్టెన్‌గా తాను నన్ను జట్టులోకి తీసుకురావడమే కాదు.. గొప్పగా రాణించేలా కూడా నన్ను ప్రోత్సహించాడు. అతను అద్భుతమైన వ్యక్తి. గొప్ప క్రికెటర్' అంటూ మోర్గన్‌ను జోఫ్రా తల్చుకున్నాడు.

పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia

ఇకపోతే తాను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి తిరిగి బౌలింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌ టైంకి అందుబాటులోకి వస్తానన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో.. ఆర్చర్ తన వెన్ను భాగంలో ఫ్రాక్చర్‌ అయి గాయపడ్డ సంగతి తెలిసిందే. తద్వారా ఇంగ్లాండ్ ఆడుతున్న చాలా సిరీస్‌లకు అలాగే ఐపీఎల్‌కు అతను దూరమయ్యాడు.

Story first published: Thursday, June 30, 2022, 17:12 [IST]
Other articles published on Jun 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X