న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో అద్భుతం: బెయిల్‌ను తాకి బౌండరీ అవతల పడిన బంతి (వీడియో)

Jofra Archer on His Remarkable Delivery Which Hit The Bail And Went For A Six

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్ వేసిన బంతి వికెట్లను తాకి నేరుగా బౌండరీలైన్‌ బయట పడింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి సంఘటన గతంలో ఎన్నడూ చోటు చేసుకోలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో

జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో

కళ్లను సైతం అమాంతం కట్టిపడేసిన ఈ అద్భుతం ఇంగ్లాండ్ పేస్ సంచలనం జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో చోటు చేసుకుంది. గతంలో బంతి బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌కు తాకి సిక్సర్‌ వెళ్లడం చూశాం కానీ.. ఇలా బెయిల్స్‌ తాకి సిక్సర్‌గా వెళ్లడం మాత్రం ఇదే తొలిసారని మ్యాచ్ అనంతరం క్రికెట్ విశ్లేషకులు వెల్లడించారు.

ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో

ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో

బంగ్లా ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఇది జరిగింది. బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ ఈ బంతికి ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్ గంటకు 144 kmphతో విసిరిన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతి వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను తాకి నేరుగా 59 మీటర్ల దూరంలో ఉన్న బౌండరీని తాకింది. ఈ డెలివరిపై జోఫ్రా ఆర్చర్‌ సైతం ఆశ్చర్యపోయాడు.

మ్యాచ్ అనంతరం ఈ డెలివరిపై

మ్యాచ్ అనంతరం ఈ డెలివరిపై జోఫ్రా అర్చర్ మాట్లాడుతూ ఇంత వరకు ఇలాంటిది ఎప్పుడు చూడలేదని, ఇది తన వేగానికి సంకేతమని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

Story first published: Monday, June 10, 2019, 17:58 [IST]
Other articles published on Jun 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X