న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Surrey vs Sussex: ఆర్చర్‌ ఈజ్‌ బ్యాక్‌.. నాట్‌ ఏ బ్యాడ్‌ డెలివరీ! బనానా ఇన్ స్వింగర్ సూపర్ (వీడియో)!

Jofra Archer departs NMJ Reifer with banana inswinger

లండన్‌: ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌కు 2021 ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా గాయాల బారిన పడుతూ జట్టులోకి వస్తూపోతున్నాడు. గత మార్చిలో టీమిండియాతో జరిగిన టెస్టు, టీ20 సిరీస్‌లో ఆడిన ఆర్చర్‌.. గాయంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కుడి చేతి గాయం తిరగబెట్టడంతో హుటాహుటిన లండన్ వెళ్లిపోయాడు. శస్త్ర చికిత్స జరగడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్‌కు కూడా దూరమయ్యాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్‌ అతడి సేవలు కోల్పోయింది.

సర్జరీ అనంతరం తాజాగా ప్రాక్టీస్‌ ఆరంభించిన జోఫ్రా ఆర్చర్ ఇంగ్లీష్‌ కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సెకండ్‌ ఎలెవెన్‌ చాంపియన్‌షిప్‌ ఆడుతున్న ఆర్చర్‌.. ససెక్స్‌ సెకండ్‌ ఎలెవెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సర్రీ సెకండ్‌ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్‌ ​అద్బుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. క్రికెట్‌లో అరుదుగా కనిపించే 'బనానా ఇన్‌స్వింగర్‌' వేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించాడు. ఆర్చర్ అద్భుత బంతికి బ్యాటింగ్‌ చేస్తున్న ఎన్‌ఎమ్‌జే రీఫిర్‌ నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సెసెక్స్‌ క్రికెట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

జోఫ్రా ఆర్చర్ 'బనానా ఇన్‌స్వింగర్‌'కు సంబందించిన వీడియోను ససెక్స్‌ క్రికెట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'నాట్‌ ఏ బ్యాడ్‌ డెలివరీ. సర్రీతో జరిగిన మ్యాచ్‌లో ఆర్చరకు రెండు వికెట్లు పడ్డాయి. ఆర్చర్‌ ఈజ్‌ బ్యాక్‌' అని పేర్కొంది. బనానా డెలివరీ అంటే బౌలర్‌ బంతిని విడుదల చేయగానే కాస్త ఎత్తులో వెళుతూ సీ షేప్‌గా మారుతుంది. అది పిచ్‌ మీద పడగానే ఇన్‌స్వింగ్‌ లేదా ఔట్‌ స్వింగ్‌ అయి యార్కర్‌లా మారుతుంది. ఒకవేళ ఆ బంతిని బ్యాట్స్‌మన్‌ వదిలేస్తే బౌల్డ్‌.. లేకపోతే ఎల్బీగా వెనుదిరగడం ఖాయం. బనానా ఇన్‌స్వింగర్‌ అంటే మనకు గుర్తుచ్చేది టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌. అతడు కూడా ఇలాంటి బంతులను అద్భుతంగా వేసేవాడు.

గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో తొలిసారి జోఫ్రా ఆర్చర్‌ మోచేతికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి అతడు కుడి మోచేతితో ఇబ్బందిపడుతున్నాడు. మధ్యలో గాయం తగ్గినా భారత్ పర్యటనలో మళ్లీ తిరగబెట్టింది. ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు ఆడి 42 వికెట్లు పడగొట్టాడు. 17 వన్డేల్లో 30, 12 టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్‌లలో 155, 27, 19 పరుగులు చేశాడు. ఇక 35 ఐపీఎల్ మ్యాచులలో 46 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ద్వారానే ఆర్చర్‌కు ఇంగ్లీష్ జట్టులో చోటు దక్కింది.

Story first published: Saturday, May 8, 2021, 21:38 [IST]
Other articles published on May 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X