న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జో రూట్ ఆ రికార్డు సాధించగలడు కానీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్లేయర్లకు అలాంటివి కష్టమే : వసీం జాఫర్

Joe Root Will Break Sachin Record In Tests If He Continues His Mojo 5 to 6 Years

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రీషెడ్యూల్డ్ ఐదవ టెస్టులో ఇండియా ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. 15ఏళ్లకు పైగా ఇంగ్లీష్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న భారత్ కలను ఇంగ్లాండ్ నెరవేరనీయలేదు. జానీ బెయిర్‌స్టో, జో రూట్ మొంటి పట్టుదలతో ఇంగ్లాండ్‌కు చరిత్రలోనే అత్యధిక ఛేజింగ్ విజయం దక్కింది. వీరిద్దరు సెంచరీలతో చివరి ఇన్నింగ్స్‌లో చెలరేగి కడవరకు క్రీజులో నిలబడ్డంతో 378పరుగుల భారీ టార్గెట్ చిన్నబోయింది. బెయిర్‌స్టో టెస్టుల్లో తన తాజా ఫామ్ పట్ల ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుండగా.. జో రూట్ యొక్క అనితర సాధ్యమైన టెస్ట్ క్రికెట్ ఫామ్ పట్ల దిగ్గజాల నుంచి గొప్ప గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇక టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును జో రూట్ అధిగమించగలడని ఇటీవలే పేర్కొనగా.. తాజాగా భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఈ విషయమై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఇండియాతో 5మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్లో 737పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. సిరీస్‌‌ను సమం చేయడంలో రూట్ కీలక పాత్ర పోషించాడు. టెస్ట్ క్రికెట్‌లో రూట్ గత రెండు సంవత్సరాలుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు.

వసీం జాఫర్.. టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డ్ మీద స్పందిస్తూ.. రూట్ వచ్చే 5-6 ఏళ్ల పాటు ప్రస్తుత స్థాయిలో ఆడితే సచిన్ అత్యధిక పరుగుల రికార్డను చేరుకోగలడని జాఫర్ పేర్కొన్నాడు. ఇకపోతే జాఫర్ ఓ డౌట్ కూడా రేజ్ చేశాడు. అదేంటంటే.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియన్ ప్లేయర్ల కెరీర్ అంత సుదీర్ఘంగా ఏం సాగదని పేర్కొన్నాడు. మధ్యలో ఫామ్ కోల్పోతే నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారు. అందువల్ల రూట్ తప్పకుండా మినిమం ఫామ్ కొనసాగిస్తేనే మరో అయిదారేళ్లలో అతను అత్యధిక పరుగుల రికార్డు తన పేరిట లిఖించుకోగలడని జాఫర్ తెలిపాడు.'

ఇకపోతే జో రూట్ టెస్టుల్లో సెంచరీల విషయంలో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్‌లను అధిగమించాడు. బర్మింగ్‌హామ్ టెస్టులో సెంచరీ తర్వాత అతను 28టెస్ట్ సెంచరీలకు చేరుకున్నాడు. ప్రస్తుతం అతను టెస్టుల్లో హషీమ్ ఆమ్లా, మైఖేల్ క్లార్క్‌లతో సమానంగా 28 సెంచరీలతో కొనసాగుతున్నాడు. ఇకపోతే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ర్యాంకులో కొనసాగుతున్న రూట్ ప్రస్తుతం 121 టెస్టుల్లో 10,458పరుగులు చేశాడు. టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డు (15,921)ను అధిగమించడానికి అతను ఇంకా 5464పరుగులు చేయాల్సి ఉంటుంది.

Story first published: Thursday, July 7, 2022, 20:52 [IST]
Other articles published on Jul 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X