న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కింది స్థాయి నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగాడు: కుక్, సెంచరీతో నిష్క్రమించు

By Nageshwara Rao
Joe Root hopes ‘most down-to-earth superstar’ Alastair Cook scores a century at Kia Oval

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌‌ల సిరిస్‌లో చివరిదైన ఐదో టెస్టులో ఓపెనర్ అలిస్టర్ కుక్ సెంచరీ సాధించాలని ఇంగ్లాండ్‌ కెప్టెన్ జోరూట్ ఆకాక్షించాడు. భారత్‌తో శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా ఐదో టెస్టు జరగనున్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్టు అనంతరం తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు కుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా టీమిండియాతో ఓవల్ వేదికగా జరిగే టెస్టు తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ అని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 3-1తో సిరీస్‌ని ఇంగ్లాండ్ జట్టు చేజిక్కించుకున్న నేపథ్యంలో నామమాత్రమైన చివరి టెస్టులోనూ గెలిచి వెటరన్ ఓపెనర్‌కి ఘనంగా వీడ్కోలు పలకాలని జో రూట్ సేన భావిస్తోంది.

టెస్టుల్లో రికార్డులివే: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలెస్టర్ కుక్టెస్టుల్లో రికార్డులివే: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలెస్టర్ కుక్

దీంతో ఐదో టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో జో రూట్ మాట్లాడుతూ "అలిస్టర్ కుక్ చాలా కింది స్థాయి నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అతను కేవలం చేసిన పరుగుల ద్వారా గొప్ప క్రికెటర్ అవ్వలేదు.. వ్యక్తిత్వంతోనూ అందరి మన్నలు పొందాడు. కుక్ రిటైర్మెంట్ బాధించే అంశం" అని అన్నాడు.

"ఒక క్రికెటర్‌గా మేము అతడ్ని అర్థం చేసుకున్నాం. 12 ఏళ్లు క్రికెట్ ఆడాడు. ముఖ్యంగా.. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుని సమర్థంగా నడిపించాడు. అతని రికార్డులను ఎక్కువ మంది క్రికెటర్లు అందుకోలేకపోవచ్చు" అని జోరూట్ పేర్కొన్నాడు. 33 ఏళ్ల కుక్ ఇప్పటివరకు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు తరుపున 160 టెస్టులు ఆడిన కుక్.. 12254 పరుగులు చేశాడు.

ఇందులో 32 సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో కుక్ యావరేది 44.88గా ఉంది. 2016లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్న అతి చిన్న క్రికెటర్‌గా రికార్డు కుక్ సృష్టించాడు. ఈ ఫీట్‌ని అతను 31 సంవత్సరాల, 157 రోజుల్లో సాధించాడు. అంతేకాదు, ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అలెస్టర్ కుక్ రికార్డులు:
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు: 12254
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు: 32
ఇంగ్లండ్ తరఫున అత్యధిక 150+ స్కోర్లు : 11
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు : 160
విరామం లేకుండా అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్ : 158 టెస్టులు
ఇంగ్లండ్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టులు: 59

Story first published: Friday, September 7, 2018, 9:41 [IST]
Other articles published on Sep 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X