న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PinkBall Test: భారత థర్డ్ అంపైర్‌పై జో రూట్ ఫిర్యాదు!!

Joe Root approach Match Referee Javagal Srinath Over 3rd Umpire Complaint

అహ్మదాబాద్: భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం ముగిసిన డేనైట్ టెస్టులో వివాదం చెలరేగింది. భారత్‌కి చెందిన థర్డ్ అంపైర్ షంషుద్దీన్ ఏకపక్షంగా, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడని ఆరోపిస్తూ ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్, కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్‌కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. తొలి రోజు ఆటలో భారత ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మల విషయంలో మూడో అంపైర్‌ షంషుద్దీన్‌ తీసుకున్న రెండు నిర్ణయాలపై ఇంగ్లండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

తొందరపాటు నిర్ణయాలు

తొందరపాటు నిర్ణయాలు

భారత్ తొలి ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే తక్కువ ఎత్తులో వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌ను స్లిప్పులో బెన్ స్టోక్స్‌ అందుకున్నాడు. చాలా తక్కువ ఎత్తులో వచ్చిన బంతి ‌స్టోక్స్ క్యాచ్‌గా అందుకునే ముందే నేలని తాకినట్లు అనుమానించిన ఫీల్డ్ అంపైర్.. తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్ సాయం కోరాడు. ఒక యాంగిల్‌లో మాత్రమే రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్ షంషుద్దీన్ బంతి నేలని తాకినట్లు తేల్చి నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ స్టంపింగ్ విషయంలోనూ ఇలానే జరిగింది. కీపర్ బెన్ ఫోక్స్ బెయిల్స్‌ని ఎగరొట్టే సమయానికే రోహిత్ క్రీజులో పాదం ఉంచినట్లు కనిపించింది. మరో యాంగిల్‌లో పరిశీలించకుండానే థర్డ్ అంపైర్ తుది తన నిర్ణయం ప్రకటించాడు.

రూట్ ఫిర్యాదు

రూట్ ఫిర్యాదు

ఇంగ్లండ్ ఫీల్డింగ్ చేసే సమయంలో అన్ని కెమెరా యాంగిల్స్‌లో రిప్లైని పరిశీలించి ఆ తర్వాత తుది నిర్ణయానికి వచ్చిన థర్డ్ అంపైర్.. భారత్ ఫీల్డింగ్ సమయంలో మాత్రం ఒకే యాంగిల్‌ పరిశీలించి నిర్ణయం వెల్లడించాడని ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్, కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్‌కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. అంపైర్లు తమ నిర్ణయాల్లో స్థిరత్వం పాటించాలని, కచ్చితత్వంతో వ్యవహరించాలని మ్యాచ్‌ రిఫరీని వారు కోరారట. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్థానిక అంపైర్లనే వినియోగించుకోవాలని ఐసీసీ ఆదేశించిన విషయం తెలిసిందే.

క్రాలీ అసంతృప్తి

క్రాలీ అసంతృప్తి

మూడో అంపైర్‌ అన్ని కోణాల నుంచి పరిశీలించకుండానే భారత బ్యాట్స్‌మెన్‌ను నాటౌట్‌గా ప్రకటించడం అసహనానికి గురి చేసిందని ఇంగ్లండ్ ఓపెనర్‌ జాక్ క్రాలీ ఇదివరకే పేర్కొన్నాడు. 'మ్యాచ్‌లో వెనకబడి ఉన్నపుడు ఆ 50-50 అవకాశాలు మాకు అనుకూలంగా రావాలని అనుకుంటాం. కానీ అలా జరగలేదు. మా బ్యాటింగ్‌ అప్పుడేమో లీచ్‌ ఔట్‌ విషయంలో అయిదారు కోణాల నుంచి పరిశీలించారు. కానీ మా ఫీల్డింగ్‌ అప్పుడు మాత్రం ఒకే కోణం నుంచి పరీక్షించారు. అది ఔటా? నాటౌటా? అని చెప్పలేను. కానీ మరింత మెరుగ్గా పరీక్షించి నిర్ణయం తీసుకోకపోవడం అసహనానికి గురి చేసింది' అని క్రాలీ అన్నాడు.

మార్చి 4 నుంచి నాలుగో టెస్టు

మార్చి 4 నుంచి నాలుగో టెస్టు

మొతేరా వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 49 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన సునాయాసంగా ఛేదించింది. స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ 11, ఆర్ అశ్విన్‌ 7 వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ఈ ఓటమితో ఇంగ్లిష్‌ జట్టు సిరీసులో 1-2తో వెనకబడింది. మార్చి 4 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

అక్ష‌ర్‌తో హార్దిక్ ఇంట‌ర్వ్యూ.. మధ్యలో దూరి కోహ్లీ ఏమన్నాడంటే? గుజ‌రాతీ భాష‌లో (వీడియో)

Story first published: Friday, February 26, 2021, 14:40 [IST]
Other articles published on Feb 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X