న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ర్యాంకింగ్స్‌: రెండేళ్ల తర్వాత మళ్లీ అగ్రస్థానంలో జులన్

Jhulan, Mandhana lead Indias lead role in ICC Rankings

హైదరాబాద్: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి నంబర్ వన్ ర్యాంకుని అందుకుంది. ఇటీవలే ఇంగ్లాండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టడం ద్వారా జులన్ గోస్వామి తన ర్యాంకింగ్స్‌ను మరింతగా మెరుగుపర్చుకుంది. ఐసీసీ సోమవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో గోస్వామి 730 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది.

<strong>వరల్డ్‌కప్‌ తర్వాత వన్డేలకు ఇమ్రాన్ తాహీర్ వీడ్కోలు</strong>వరల్డ్‌కప్‌ తర్వాత వన్డేలకు ఇమ్రాన్ తాహీర్ వీడ్కోలు

గత ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచిన 36 ఏళ్ల జులన్‌ ఈసారి రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకుంది. 2016 ఫిబ్రవరిలో తొలిసారి వరల్డ్‌ నంబర్‌వన్‌ బౌలర్‌గా అవతరించిన జులన్‌ గోస్వామి ఆ తర్వాత తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. మళ్లీ ఇంగ్లాండ్‌తో తాజా వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి నంబర్ వన్ స్థానాన్ని అందుకుంది.

ఇప్పటివరకు 177 వన్డేలు ఆడిన జులన్‌ 218 వికెట్లు తీసింది. మరోవైపు భారత్‌కే చెందిన మరో పేస్‌ బౌలర్‌ శిఖా పాండే 13వ ర్యాంక్‌ నుంచి ఐదో ర్యాంక్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో శిఖా పాండే ఎనిమిది వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. 2010 తర్వాత టాప్‌--5లో ఇద్దరు భారత పేస్‌ బౌలర్లు నిలవడం ఇదే ప్రథమం.

2010లో రుమేలీ ధర్, జులన్‌ టాప్‌-5లో నిలిచారు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌కే చెందిన స్మృతి మంధాన 797 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాల్లో కొనసాగడం 2012 తర్వాత మొదటిసారి కావడం విశేషం. 2012లో జులన్‌ గోస్వామి... మిథాలీ రాజ్‌ ఈ ఘనత సాధించారు. ఇక, జట్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా(142), భారత్ (122) టాప్-2లో ఉన్నాయి.

Story first published: Tuesday, March 5, 2019, 11:29 [IST]
Other articles published on Mar 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X