న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘ఈ రోజుతో ఈ జర్నీ ముగిసింది.. రెండు దశాబ్దాలుగా ఆ ఘనత దక్కింది’.. ఝులన్ గోస్వామి భావోద్వేగ సందేశం

Jhulan Emotional Tweet With A Special Note, Thanking Wellwishers On The Occasion of Her Retirement

భారత దిగ్గజ వుమెన్స్ ప్లేయర్ ఝులన్ గోస్వామి ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ల ఝులన్ 12 టెస్టులు, 204 వన్డేలు 68 టీ20 మ్యాచ్‌లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. ఎందరో ప్లేయర్లకు ఆమె ప్రేరణగా నిలిచింది. గోస్వామి తన కెరీర్‌లో మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ తనకు చివరిదని ఆమె ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.

లార్డ్స్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో విజయంతో భారత్‌ 3-0 తేడాతో సిరీస్ గెలిచిన ఝులన్ గోస్వామికి టీమిండియా ప్లేయర్లు ఘనంగా వీడ్కోలు పలికారు. గోస్వామికి లార్డ్స్ స్టేడియంలో ప్రేక్షకుల స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. అభిమానులు సైతం ఈ మ్యాచ్‌కు పెద్దసంఖ్యలో వచ్చారు. ఆఖరి వన్డేలో ఝులన్ పొదుపుగా బౌలింగ్ చేసి తన పది ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టింది.

ప్రతీ ప్రయాణం ముగియాల్సిందే

ఇక తన క్రికెట్ జర్నీలో భాగమైన తన అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేసింది. 'ఈ రోజు క్రికెట్ జర్నీ చివరకు వచ్చింది. ప్రతి ప్రయాణానికి ముగింపు ఉన్నట్లే.. నేను అన్ని రకాల క్రికెట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించడంతో 20ఏళ్లకు పైగా సాగిన నా క్రికెట్ ప్రయాణం ఈరోజుతో ముగిసింది. ప్రతి ప్రయాణానికి ముగింపు తప్పకుండా ఉంటుంది. ఈ ప్రయాణం నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. ఎంతో ఉల్లాసంగా, థ్రిల్లింగ్‌గా ఉంది. రెండు దశాబ్దాలకు పైగా భారత జెర్సీని ధరించి.. నా శక్తి మేరకు నా దేశ జట్టుకు సేవ చేసిన ఘనత నాకు దక్కింది. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం విన్న ప్రతిసారీ నాకు అంతులేని గర్వం కలుగుతుంది' అని గోస్వామి తన సందేశంలో పేర్కొంది.

క్రికెట్ నాకు అనేక బహుమతులిచ్చింది

క్రికెట్ నాకు అనేక బహుమతులిచ్చింది

'క్రికెట్ నాకు సంవత్సరాలుగా అనేక బహుమతులిచ్చింది. నిస్సందేహంగా క్రికెట్ చాలా గొప్పది, ఉత్తమమైంది. ఈ ప్రయాణంలో నేను కలుసుకున్న వ్యక్తులు, నా స్నేహితులు, నా ప్రత్యర్థులు, సహచరులు, నేను ఇంటరాక్ట్ చేసిన జర్నలిస్టులు, మ్యాచ్ అధికారులు, బోర్డు అధికారులు ఇలా అందరితో అటాచ్ మెంట్ ఏర్పడింది. 1997లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ను వీక్షించినప్పటి నుంచి.. భారత్ తరఫున ఆడాలనేది నా కల. ఆ కల నెరవేరి 20ఏళ్లు కొనసాగడం అద్భుతం. ఇంత మంచి అవకాశమిచ్చిన బోర్డు ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియాకి, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఎయిర్ ఇండియా అధికారులందరికీ ధన్యవాదాలు. మీరు నాపై ఉంచిన నమ్మకంతోనే నా కలను నెరవేర్చుకోవడానికి నాకు అవకాశం దక్కింది' అనే ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు.

కెప్టెన్లందరీకీ, సహచరులందరికీ థాంక్స్

కెప్టెన్లందరీకీ, సహచరులందరికీ థాంక్స్

'గాయాల బారిన పడ్డప్పుడు నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సంవత్సరాలుగా నన్ను ఫిట్‌గా ఉంచినందుకు జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)కి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అంతర్భాగంగా ఉన్న కోచ్‌లు, శిక్షకులు, ఫిజియోలు, గ్రౌండ్ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో నేను నా కెప్టెన్లందరికీ తప్పకుండా ఓ చెప్పాల్సిందే. నా సామర్థ్యాలపై వారు ఉంచిన విశ్వాసం నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడింది. గ్రౌండ్లోను, గ్రౌండ్ బయట నా సహచరులతో అంతర్జాతీయ క్రికెటర్‌గా నా జీవితంలో గత 20 ఏళ్లలో ప్రతి క్షణాన్ని నేను ఎంతో ఆదరించాను. మీ నుండి" అని గోస్వామి తన ట్వీట్‌ను ఈ సందేశంతో ముగించారు.

Story first published: Sunday, September 25, 2022, 19:29 [IST]
Other articles published on Sep 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X