న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్‌తోనే అది సాధ్యం: జెమీమా

Jemimah Rodrigues Says Full fledged women’s IPL will help unearth new talent

న్యూఢిల్లీ: పూర్తిస్థాయిలో మహిళల ఐపీఎల్‌ను నిర్వహిస్తే.. యువ క్రీడాకారిణుల ప్రతిభ వెలుగు చూస్తుందని టీమిండియా బ్యాట్స్‌వుమన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ అభిప్రాయపడింది.
టీనేజ్‌ సంచలనం షెఫాలీ వర్మ కూడా అలాగే జట్టులో చోటు దక్కించుకుందని ఉదాహరణగా పేర్కొంది. మహిళల క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాల్లో టీ20 టోర్నీలు నిర్వహిస్తున్నాయని, భారత్‌లో కూడా అలాగే చేయాలని జెమీమా సూచించింది. అప్పుడే భారత మహిళల జట్టు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోందని తెలిపింది.

'ఐపీఎల్‌ ద్వారానే షెఫాలీ వెలుగులోకి వచ్చింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో డేరింగ్‌ బ్యాట్స్‌వుమన్‌గా షెఫాలీ నిలిచింది. పూర్తి స్థాయిలో ఐపీఎల్ నిర్వహిస్తే అలాంటి వాళ్లు మరింత మంది వెలుగు చూసే అవకాశం ఉంది'అని ఐసీసీ 100% క్రికెట్‌షోలో జెమీమా తెలిపింది.

క్రికెట్‌ అభివృద్ధికే కాదు.. భారత జట్టు బెంచ్‌ బలాన్ని పెంచుకొనేందుకు కూడా ఐపీఎల్‌ దోహదపడుతుందని అభిప్రాయపడింది. రెండేళ్లుగా బీసీసీఐ.. మహిళల ఐపీఎల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కానీ, పూర్తిస్థాయి లీగ్‌ను నిర్వహించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఎప్పటి నుంచో ఇదే డిమాండ్ చేస్తుంది. పురుషుల తరహాలో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని, తద్వార మరుగనపడిన ప్రతిభ బయటకు వస్తుందని చెబుతుంది.

పాకిస్థాన్ తరఫున ఫీల్డింగ్ చేసిన సచిన్పాకిస్థాన్ తరఫున ఫీల్డింగ్ చేసిన సచిన్

Story first published: Thursday, June 18, 2020, 9:33 [IST]
Other articles published on Jun 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X