న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'క్రికెటర్లు రాజకీయాల గురించి మాట్లడకపోతే మంచిది'

Javed Miandad advises cricketers to avoid speaking on political issues

హైదరాబాద్: బ్రిటిష్ పార్లమెంట్‌లో విద్యార్థులతో మాట్లాడుతూ.. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని పాకిస్తాన్‌కు అవసర్లేదంటూ షాహిద్ అఫ్రీది చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారి తీసింది. పాక్‌కు ఉన్న నాలుగు ప్రావిన్స్ సరిపోతాయని అలా కాకుండా కశ్మీర్ గురించి వివాదాలు అనవసరమంటూ అఫ్రీది కామెంట్ చేశాడు. వీటిని ఆధారంగా చేసుకుని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాక్‌కు నిజంగానే అవసర్లేదని వాళ్లు సరిగ్గా ఉన్న వాటినే చూసుకోలేకపోతున్నారంటూ పేర్కొన్నాడు.

ఇటువంటి వివాదస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని.. రాజకీయ సంబంధిత అంశాలపై స్పందించడానికి దూరంగా ఉండాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ఆదేశ క్రికెటర్లకు సూచించాడు. ఇలా వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించకపోవడం ద్వారా వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండొచ్చని తెలిపాడు.

కాశ్మీర్ సమస్యపై పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రీది చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జావెద్ స్పందించారు. పాకిస్థాన్‌లో ఉన్న నాలుగు ప్రావిన్స్‌లనే సరిగ్గా పాలించలేకపోతున్నాం. ఇటీవల పాక్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల సమయంలోనూ పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా రాజకీయ అంశాలపై విపరీతంగా స్పందించిన విషయం తెలిసిందే.

'అఫ్రీది చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. అలాంటి వాటిని తగ్గించుకోవాలి. రాజకీయ, సున్నిత సమస్యలపై ప్రకటనలు ఇవ్వకుండా వాటికి దూరంగా ఉండటం అత్యుత్తమం. రిటైర్ అయ్యేవరకు ఆటగాళ్లు క్రికెట్‌పై దృష్టిపెట్టడం, ఆ తర్వాత కెరీర్‌ను మరోలా ప్రారంభించడం చాలా మంచిదంటూ' జావెద్ వెల్లడించారు.

Story first published: Friday, November 16, 2018, 14:21 [IST]
Other articles published on Nov 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X