టీమిండియాకు డేంజర్ బెల్స్: రెచ్చిపోయి ఆడుతున్న బట్లర్: సెంచరీతో కదం తొక్కిన జేసన్ రాయ్

England coasted to an eight-wicket victory with nearly 20 overs to spare in the third one-day international, sealing the series 3-0.

లండన్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఇవ్వాళ్టి నుంచి గ్రౌండ్‌లోకి దిగనుంది. వార్మప్ మ్యాచ్‌తో తన సిరీస్‌ను ఆరంభించనుంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్‌ ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌ అధికారిక యూట్యూబ్ ఛానల్ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వార్మప్ మ్యాచ్ ఆడబోయే తుది జట్టు కూడా రెడీ అయింది. సుదీర్ఘ విరామం తరువాత రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌లల్లో అడుగుపెట్టనున్నాడు.

ఇంగ్లాండ్‌తో టీమిండియా సిరీస్..

దీని తరువాత మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో తలపడనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ వచ్చేనెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్‌, ట్రెంట్ బ్రిడ్జ్‌ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. అనంతరం రెండు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. 12వ తేదీన ఓవల్ 14న లార్డ్స్‌లో నిర్వహించే మ్యాచ్‌లల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడతాయి.

సిరీస్ క్లీన్ స్వీప్..

భారత్‌తో తలపడటానికి ముందు ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్‌తో మూడు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌ను దిగ్విజయంగా ముగించకుంది. నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ 3-0తో ఈ సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లోనూ ది బెస్ట్ అనిపించుకుంది. నెదర్లాండ్స్ పెద్ద బలమైన జట్టేమీ కాదు గానీ..ఈ సిరీస్‌తో ఇంగ్లాండ్ తన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ మొత్తాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది ఉపయోగపడింది.

మూడు వన్డేలపై ఆధిపత్యం..

ఆ జట్టు ఆటగాళ్లందరూ ఫుల్ ఫామ్‌లో ఉంటోన్నారు.. ఒక్క కేప్టెన్ ఇవాన్ మోర్గాన్ తప్ప. ఈ మూడు మ్యాచ్‌లల్లో కలిపి నాలుగు సెంచరీలను నమోదు చేశారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. తొలి వన్డేలో ఏకంగా 498 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోర్ ఇదే. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఫిల్ సాల్ట్, డేవిడ్ మలన్, జోస్ బట్లర్ సెంచరీలు బాది అవతల పడేశారు. లియామ్ లివింగ్‌స్టొన్ 22 బంతుల్లోనే 66 పరుగులు ఊదేశాడు.

ఇంగ్లాండ్ జోరు..

రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగింది. నెదర్లాండ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని 36 ఓవర్లలోనే ఛేదించారు. ఓపెనర్లు జేసన్ రాయ్73, ఫిల్ సాల్ట్-77 పరుగులు చేశారు. మూడో వన్డేలో మరో సెంచరీని నమోదు చేసింది ఇంగ్లాండ్. జట్టు ఓపెనర్ జేసన్ రాయ్ 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 86 బంతుల్లో 15 ఫోర్లతో సెంచరీ బాదాడు. జోస్ బట్లర్ మరోసారి విశ్వరూపాన్ని చూపించాడీ మ్యాచ్‌లో 64 బంతుల్లో 86 పరుగుల చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, అయిదు సిక్సర్లు కొట్టాడు.

30 ఓవర్లలోనే భారీ లక్ష్యం..

ఆమ్‌స్టెల్వీన్‌లో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.2 ఓవర్లల్లో 244 పరుగులు చేసింది. మ్యాక్స్ ఓడోవ్డ్ 50, బాస్ డె లెడె 56, కేప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 64 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లల్లో డేవిడ్ విల్లే నాలుగు వికెట్లు నేలకూల్చాడు. బ్రైడన్ కార్స్ 2, లియామ్ లివింగ్‌స్టొన్, ఆదిల్ రషీద్, డేవిడ్ పెన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 30.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓవర్‌కు 8.22 పరుగుల చొప్పున స్ట్రైక్ రేట్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.

ఫుల్ ఫామ్‌లో..

రెండు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్ జేసన్ రాయ్ సెంచరీతో కదం తొక్కగా.. మరో ఓపెనర్ 30 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. డేవిడ్ మలాన్ డకౌట్ అయ్యాడు. జోస్ బట్లర్ తనదైన శైలిలో విజ‌ృంభించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన బట్లర్.. అదే దూకుడును నెదర్లాండ్స్‌పైనా కొనసాగించాడు. తాను ఫుల్ ఫామ్‌లో ఉన్నాననే సంకేతాన్ని టీమిండియాకు పంపించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, June 23, 2022, 11:56 [IST]
Other articles published on Jun 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X