న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లారా కంటే సచిన్‌ వికెట్ తీయడం కష్టం: ఆసీస్‌ మాజీ పేసర్‌

Jason Gillespie picks tougher opponent between Sachin Tendulkar and Brian Lara


సిడ్నీ
: బ్రియాన్‌ లారాను ఔట్‌ చేయడం కంటే సచిన్‌ టెండూల్కర్ వికెట్‌ తీయడం మరింత కష్టతరం అని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జాసన్‌ గిలెస్పీ అభిప్రాయపడ్డాడు. సచిన్‌, లారాల్లో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే తేల్చుకోవడం కష్టమేనని పేర్కొన్నాడు. అత్యుత్తమ బ్యాట్స్ మెన్ విషయంలో సచిన్‌, లారాలు నిరంతరం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మాజీ ఆటగాళ్లు అందరు ఈ ఇద్దరు దిగ్గజాల గురించి తమ తమ అభిపాయాలను పంచుకుంటున్నారు.

చులకనవుతున్నాం.. పాక్‌ క్రికెటర్లు బాధ్యతగా ఉండండి: తన్వీర్చులకనవుతున్నాం.. పాక్‌ క్రికెటర్లు బాధ్యతగా ఉండండి: తన్వీర్

ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సచిన్, లారాల్లో ఎవరు కఠినమైన ప్రత్యర్థి అని గిలెస్పీని ప్రశ్నించగా... 'వారిద్దరూ భిన్నమైన ఆటగాళ్లు. వారిని ఔట్‌ చేయడం చాలా కష్టం. లారాతో పోల్చుకుంటే..సచిన్‌ వికెట్‌ తీయడం మరింత కష్టతరమని ఎప్పుడూ అనుకునేవాడిని' అని గిలెస్పీ వెల్లడించాడు. 'సచిన్‌ కంటే లారా వికెట్‌ తీసేందుకే ఇష్టపడేవాడిని. ఎందుకంటే లారా భారీ షాట్లు ఆడతాడు. ఆ సమయంలో అతడి వికెట్‌ సాధించేందుకు ప్రయత్నించేవాడిని. కానీ నెమ్మదిగా ఆడే సచిన్‌ను ఔట్‌ చేయడం మరింత కష్టమయ్యేది' అని గిలెస్పీ చెప్పుకొచ్చాడు.

'సచిన్, లారా ఎంతో గొప్ప ఆటగాళ్లు. వారిద్దరితో కలిసి ఆటలో భాగమైనందుకు గర్విస్తున్నా. అలాంటి లెజెండరీ ఆటగాళ్ల గురించి మాట్లాడడం కూడా గౌరవమే. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేసినందుకు సంతృప్తికరంగా ఉన్నాను. క్రికెటర్‌ను అయినందుకు గర్వంగా ఉంది' అని జాసన్‌ గిలెస్పీ పేర్కొన్నాడు. టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్‌ శర్మను ఈ మాజీ పేసర్‌ కొనియాడాడు. సీనియర్ బౌలర్ అయినా.. కొత్త విషయాలను తెలుసుకొవడానికి ఇషాంత్ ఎప్పుడూ ముందుంటాడు అని తెలిపాడు.

గెలెస్పీ తాజాగా స్కై స్పోర్ట్స్‌తో మాట్లడుతూ... 'జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన పేసర్​. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కొన్నిసార్లు అతడి ప్రవర్తనను ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల అసలైన పోటీతత్వం బయటకు రాకపోవచ్చు. కొన్నిసార్లు ప్రవర్తనను బట్టి ఆటగాళ్లు అంకితభావంతో లేరని మనం ఊహించుకోకూడదు' అని గెలెస్పీ చెప్పాడు. 'గతేడాది ప్రపంచకప్​ జరుగుతున్నప్పుడు ఖాళీ సమయంలో ససెక్స్ జట్టు యువ ప్లేయర్ల దగ్గరికి ఆర్చర్ వెళ్లడం చూశా. వారితో అతడు మంచిగా, ఎంతో ఉత్సాహంతో మెలిగాడు' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, April 20, 2020, 13:12 [IST]
Other articles published on Apr 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X