న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Jason Gillespie: మన్కడింగ్ చేసే ముందు నాన్ స్ట్రైకర్ బ్యాటర్‌ను హెచ్చరించాలని రూల్ ఏం లేదు..దీప్తి ఇజ్ కరెక్ట్

Jason Gillespie Gave A Clarity About Mankading, He Says No need To give Warning to Non Striker

మాజీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాసన్ గెలెస్పీ మన్కడింగ్ విషయమై తన వ్యూస్ వెల్లడించాడు. నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో బ్యాటర్లను రన్ అవుట్ చేసే విషయంలో స్పిరిట్ ఆఫ్ క్రికెట్, తదితర విషయాలను పట్టించుకోకుండా క్రికెటర్లు చట్టాలను పక్కాగా పాటించాలని తెలిపాడు. గెలెస్పీ వాదన దీప్తి శర్మ చేసింది సరైన పనే అని చెబుతుంది. భారత స్టార్ దీప్తి శర్మ వివాదాస్పద రీతిలో ఇంగ్లాండ్ బౌలర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్ పద్ధతిలో తొలగించిన తర్వాత చట్టాలు, స్పిరిట్ ఆఫ్ ది గేమ్ తదితర విషయాల మీద విపరీతంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

లార్డ్స్‌లో దీప్తి.. ఛార్లీ డీన్‌కు ముందే వార్నింగ్ ఇచ్చామని, క్రీజు దాటొద్దంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే భారత ఆల్‌రౌండర్ వాదనలను ఇంగ్లాండ్ ఫుల్‌టైమ్ కెప్టెన్ హీథర్ నైట్.. స్పందిస్తూ ఎలాగూ ఔట్ చేశారు. అంతా బానే ఉంది..ముందే హెచ్చరించామని చెబుతూ ఈ విషయంలో టీమిండియా ప్లేయర్లు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఇకపోతే ఈ విషయమై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ సైతం.. దీప్తి శర్మ మన్కడింగ్ చేసేముందు చార్లీ డీన్‌కు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందా? అంటూ ట్విట్టర్లో పేర్కొంది. దీనిపై గెలెప్సీ స్పందిస్తూ.. క్రికెట్ చట్టంలో ఎక్కడ కూడా నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు రనౌట్ చేసే టైంలో వార్నింగ్ ఇవ్వాలని లేదని, అందువల్ల ముందుగా నాన్ స్ట్రైకర్‌కు హెచ్చరికలు చేయాల్సిన పనిలేదని, క్రికెట్ రూల్స్ ప్రకారం.. నడుచుకుంటూ సరిపోతుందని గెలెస్పీ అన్నాడు.

ఈ మేరకు గెలెస్పీ ట్వీట్ చేస్తూ.. చట్టాల ప్రకారం ఆడితే.. ఆటోమేటిక్‌గా ఆటలో ప్రతి చట్టం భాగమవుతుందని అతను స్పష్టం చేశాడు.ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలవడానికి 17పరుగులు అవసరం. చేతిలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే ఉంది. షార్లెట్ డీన్ కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిపించేలా ఉంది. అయితే ఆమె ఆత్రుతను దీప్తి శర్మ గమనించి.. డీన్‌ను మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేసింది.

నిబంధనల ప్రకారం.. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ బంతి రిలీజ్ చేయడానికి ముందే క్రీజ్‌ను వదిలివేస్తే.. బౌలర్ చట్టబద్ధంగా ఆ బ్యాటర్‌ను రనౌట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. చట్టం ప్రకారం ఇది లీగల్ అని ఎంసీసీ కమిటీ కూడా పేర్కొంది. ఐసీసీ అప్డేటెడ్ రూల్స్ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

Story first published: Tuesday, September 27, 2022, 15:10 [IST]
Other articles published on Sep 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X