న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

700 వికెట్లు కూడా తీయగలను: అండర్సన్‌

James Anderson says I can reach the 700 wicket mark

లండన్: 600 వికెట్ల మైలురాయిని అందుకున్నా.. 38 ఏళ్లు వచ్చినా.. ఇంగ్లండ్ సీనియర్ పేస్ బౌలర్, స్వింగ్ కింగ్ జేమ్స్‌ అండర్సన్‌ ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచనలో మాత్రం లేడు. తాను 700 వికెట్ల మైలురాయిని అందుకోగలని ధీమా వ్యక్తం చేశాడు. 700 వికెట్ల మైలురాయిని అందుకోలేననడానికి కారణాలేమీ కనిపించట్లేదని అండర్సన్‌ చెప్పాడు. టెస్టు చరిత్రలో 600వికెట్లు తీసిన తొలి పేసర్‌గా అండర్సన్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

టీ20ల్లో 500 వికెట్లు.. చరిత్ర సృష్టించిన డ్వేన్ బ్రావో!!టీ20ల్లో 500 వికెట్లు.. చరిత్ర సృష్టించిన డ్వేన్ బ్రావో!!

700 వికెట్లు కూడా తీయగలను:

700 వికెట్లు కూడా తీయగలను:

పాకిస్థాన్‌తో మూడో టెస్టులో మంగళవారం అజర్‌ అలీ వికెట్‌ తీయడం ద్వారా జేమ్స్‌ అండర్సన్ 600 వికెట్ల మార్కును అందుకున్నాడు. కాగా తాను మరికొంత కాలం క్రికెట్‌లో కొనసాగుతానన్న నమ్మకం ఉందని అండర్సన్‌ బుధవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ' కెప్టెన్ జో రూట్‌తో మాట్లాడా. వచ్చే ఏడాది యాషెస్‌ సిరీస్‌ కోసం నేను ఆస్ట్రేలియాలో ఉండాలని అతడు కోరుకుంటున్నాడు. నేను వెళ్లకూడదనడానికి కారణమేమీ కనిపించట్లేదు. నాలో సత్తా ఉందని నేను భావించినంత కాలం ఆడుతూనే ఉంటా. ఇంగ్లండ్ క్రికెటర్‌గా నా చివరి టెస్టు ఆడేశాననునుకోవట్లేదు. నేను 700 వికెట్ల మైలురాయిని అందుకోగలనా? ఎందుకు అందుకోలేను?' అని అండర్సన్ పేర్కొన్నాడు.

నిరంతరం శ్రమిస్తున్నా:

నిరంతరం శ్రమిస్తున్నా:

'ఫిట్‌నెస్‌ పెంచుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నా. మ్యాచ్‌ల్లోనూ రాణిస్తున్నా. జట్టుకు సేవలు అందించే సత్తా ఇంకా నాలో ఉంది. టెస్టు జట్టులో కొనసాగేందుకు నేను నిత్యం శ్రమిస్తూ నిరూపించుకుంటూనే ఉంటా' అని ఇంగ్లండ్ సీనియర్ పేస్ బౌలర్ అండర్సన్‌ తెలిపాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి బౌలర్‌గా జేమ్స్ అండర్సన్‌ ఇదివరకే రికార్డుల్లోకి ఎక్కాడు. 2019 డిసెంబర్ నెలలో సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారానే ఆ మార్క్ అందుకున్నాడు.

రిటైర్‌మెంట్ ఆలోచనే లేదు:

రిటైర్‌మెంట్ ఆలోచనే లేదు:

ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండ‌ర్స‌న్ తన రిటైర్మెంట్ వార్తలపై ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో రిటైర్‌మెంట్ ఆలోచనే లేదని, ఇంకొన్నాళ్లు కొనసాగుతా అని స్పష్టం చేశాడు. 2021-22 యాషెస్ సిరీస్ ఆడుతానని చెప్పకనే చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో కమిన్స్‌ ఇప్పటివరకు 156 టెస్టుల్లో, 194 వన్డేల్లో, 19 టీ20 మ్యాచ్‌ల్లో ఇంగ్లీష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

టాప్‌-10లోకి:

టాప్‌-10లోకి:

పాకిస్థాన్‌తో మూడో టెస్టులో ఏడు వికెట్లతో సత్తాచాటిన జేమ్స్ అండర్సన్..‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్‌-10లోకి వచ్చాడు. బుధవారం తాజా ర్యాంకింగ్స్‌ వెల్లడవగా.. జేమ్స్‌ ఆరు ర్యాంక్‌లు ఎగబాకి ఎనిమిదో ర్యాంకుకు చేరాడు. ఆస్ట్రేలియా పేసర్‌ కమిన్స్‌ టాప్‌ ర్యాంక్‌ నిలబెట్టుకున్నాడు. ఆండర్సన్‌ బౌలింగ్‌ పార్ట్‌నర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ 845 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో టెస్టులో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన జిమ్మీ.. ఓవరాల్‌గా సిరీస్‌లో 11 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Thursday, August 27, 2020, 13:37 [IST]
Other articles published on Aug 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X