న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కరోనా' నా కెరీర్‌ని మరో రెండేళ్లు పొడిగించింది: స్టార్ పేసర్

James Anderson Says Coronavirus Pandemic break could add a year or two to my career

లండన్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన విరామ సమయం తన కెరీర్‌ని ఓ ఏడాది లేదా రెండు ఏళ్లు పొడిగించేలా చేసిందని ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ అభిప్రాయపడ్డాడు. వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు మూడు నెలల పాటు క్రీడాలోకం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. కరోనా వ్యాప్తి కారణంగా అన్ని దేశాల్లో లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు.

రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు రాణి రాంపాల్‌!!రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు రాణి రాంపాల్‌!!

కరోనా నా కెరీర్‌ని మరో రెండేళ్లు పొడిగించింది:

కరోనా నా కెరీర్‌ని మరో రెండేళ్లు పొడిగించింది:

అయితే వైరస్ కారణంగా ఏర్పడిన విరామ సమయం తనకు లాభం చేకూరిందని, తన కెరీర్ పొడిగించే పరిస్థితి నెలకొందని బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జేమ్స్ ఆండర్సన్ తెలిపాడు. 'మళ్లీ క్రికెట్ ఆడటం సంతోషంగా ఉంది. కానీ ప్రేక్షకులు లేకుండా నెట్స్‌లో బౌలింగ్ చేయడం కాస్త విచిత్రంగా ఉంది. అయినప్పటికీ మళ్లీ క్రికెట్ ఆడటం ఆనందంగా ఉంది. విరామ సమయం లాభం చేకూర్చింది. ఈ విరామంతో మరో ఏడాది లేదా రెండు ఏళ్లు క్రికెట్ ఆడొచ్చు' అని 37 ఏళ్ల ఇంగ్లీష్ పేసర్ అన్నాడు.

బంతులను కూడా నేనే తెచ్చుకుంటున్నా

బంతులను కూడా నేనే తెచ్చుకుంటున్నా

'మైదానంలోకి నా కిట్‌లను నేనే తీసుకువస్తున్నాను. శిక్షణకు సంబందించిన ప్రతి ఒక్కటి నా వద్ద ఉన్నాయి. బంతులను కూడా నేనే తెచ్చుకుంటున్నాను. నెట్స్‌లో కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసి ఆపై నేరుగా కారులో తిరిగి ఇంటికి వెళ్తున్నా' అని అండర్సన్ తెలిపాడు. మైదానంలో కృత్రిమ ప్రేక్షకుల శబ్ద ఆలోచనకు అండర్సన్ మద్దతు ఇచ్చాడు. 'ఆస్ట్రేలియాలో జరిగే రగ్బీ లీగ్‌ను చూస్తున్నా. స్టేడియంలో స్పీకర్ల ద్వారా వచ్చే ప్రేక్షకుల శబ్దం.. నిజంగా వారు ఉన్నట్టే అనిపిస్తోంది. అభిమానులు లేనప్పటికీ ఆ విధమైన వాతావరణాన్ని కలిగి ఉండటం చాలా బాగుంది. ఇది క్రికెట్లో కూడా వర్కౌట్ అవుతుంది' అని జేమ్స్ ఆండర్సన్ అభిప్రాయపడ్డాడు.

జనవరి తర్వాత క్రికెట్‌కి దూరం

జనవరి తర్వాత క్రికెట్‌కి దూరం

గాయం కారణంగా జనవరి తర్వాత క్రికెట్‌కి దూరమైన జేమ్స్ ఆండర్‌సన్.. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కి ముందు జరిగే ప్రాక్టీస్ కోసం ఆహ్వానించిన 55 మంది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా రద్దైన తమ హోం సిరీస్‌ని మూడు టెస్ట్‌ల వెస్టిండీస్ సిరీస్‌తో తిరిగి ప్రారంభించేందుకు ఇంగ్లండ్ బోర్డు సిద్ధమైంది. పూర్తిస్థాయి భద్రత మధ్య ఈ సిరీస్ జూలై 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

150వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి బౌలర్

150వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి బౌలర్

ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన బౌలర్ అయిన జేమ్స్ అండర్సన్.. ఇప్పటి వరకు 151 టెస్టులు ఆడాడు. 2.86 ఎకానమీ, 56.1 స్ట్రైక్ రేట్‌తో 584 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 269 వికెట్లు తీసుకున్నాడు. ఇక 19 టీ20లో 18 వికెట్లు కూల్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి బౌలర్‌గా అండర్సన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేదు. షేన్ వార్న్ (145), ముత్తయ్య మురళీధరన్ (133), అనిల్ కుంబ్లే (132), గ్లెన్ మెక్‌గ్రాత్ (124) లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును 37 ఏళ్ల జేమ్స్‌ అండర్సన్‌ అందుకున్నాడు. ఒక పేస్ బౌలర్ 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడడం విశేషం.

Story first published: Tuesday, June 2, 2020, 18:28 [IST]
Other articles published on Jun 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X