న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్వారంటైన్‌ సెలవుల్లో అండర్సన్‌ ఎంజాయ్.. అమ్మాయిలను ఎత్తుకొని (వీడియో)!!

James Andersons Quarantine Workout Will Leave You In Splits

లండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు అనుకోని విరామం ఏర్పడింది. వైరస్ రోజురోజుకు విజృంభిస్తుండడంతో ఉన్నపళంగా అన్ని దేశాల క్రికెట్ క్రికెట్ బోర్డులు సిరీసులను వాయిదా వేశాయి. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ 2020ని ఏప్రిల్‌ 15కు బీసీసీఐ వాయిదా వేసింది. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కూడా వాయిదా పడింది. దీంతో ఎప్పుడూ తీరిక లేకుండా క్రికెటర్లకు ఖాళీ సమయం దొరికింది.

<strong>డికాక్‌ బాగా చేస్తాడు.. అతడు తోడుగా ఉంటేనే క్వారంటైన్‌కు వెళ్తా: స్టెయిన్‌</strong>డికాక్‌ బాగా చేస్తాడు.. అతడు తోడుగా ఉంటేనే క్వారంటైన్‌కు వెళ్తా: స్టెయిన్‌

కూతుళ్లను ఎత్తుకొని పుష్‌అప్‌

కూతుళ్లను ఎత్తుకొని పుష్‌అప్‌

ప్రస్తుతం అన్ని సిరీసులు వాయిదా పడడంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు అందరూ ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అయితే క్వారంటైన్‌ సెలవుల్లో ఏం చేస్తున్నాడో ఇంగ్లిష్ పేసర్‌ జిమ్మీ అండర్సన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇంటి దగ్గర అతడు తన కుమార్తెలనే బరువుగా ఎత్తుతూ వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేశాడు. 'నేను ఇంట్లో ఉండి శిక్షణ పొందేందుకు ఈ అమ్మాయిలు ఎక్కువ సంతోషంగా ఉన్నారు' అని ఓ వ్యాఖ్య పెట్టాడు.

151 టెస్టులు.. 584 వికెట్లు

151 టెస్టులు.. 584 వికెట్లు

అన్ని సిరీసులు వాయిదా పడటంతో శ్రీలంక పర్యటనలో ఉన్న జేమ్స్ అండర్సన్‌ సహచరులతో కలిసి స్వదేశానికి వచ్చాడు. ఎక్కువ మంది క్రికెటర్లు సోషల్‌ మీడియా ద్వారానే అభిమానులకు టచ్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన బౌలర్ అయిన అండర్సన్.. ఇప్పటి వరకు 151 టెస్టులు ఆడాడు. 2.86 ఎకానమీ, 56.1 స్ట్రైక్ రేట్‌తో 584 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 269 వికెట్లు తీసుకున్నాడు.

తొలి బౌలర్‌గా అండర్సన్‌ రికార్డు

తొలి బౌలర్‌గా అండర్సన్‌ రికార్డు

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి బౌలర్‌గా అండర్సన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేదు. షేన్ వార్న్ (145), ముత్తయ్య మురళీధరన్ (133), అనిల్ కుంబ్లే (132), గ్లెన్ మెక్‌గ్రాత్ (124) లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును 37 ఏళ్ల జేమ్స్‌ అండర్సన్‌ అందుకున్నాడు. ఒక పేస్ బౌలర్ 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడడం విశేషం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టెస్టుల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్లలో అండర్సన్ ఒకడు. ఐదుసార్లు అవుట్ చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో నాథన్ లియాన్, స్టువర్ట్ బ్రాడ్‌ కూడా కోహ్లీని ఇబ్బంది పెట్టారు.

గేల్ కూడా ఇంట్లోనే

'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ కూడా ఇంట్లోనే సరదాగా గడుపుతున్నాడు. అయితే సూపర్ హీరో సూట్‌ ధరించి ఇంట్లోని జిమ్‌లో వర్కౌట్స్ చేసాడు. వెనకాల సాంగ్ ప్లే అవవుతుండగా.. బరువులు ఎత్తడం, పుష్-అప్‌లు చేయడం వంటివి చేసాడు. దీనికి సంబందించిన వీడియోను గురువారం గేల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Friday, March 20, 2020, 11:21 [IST]
Other articles published on Mar 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X