న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA 2022 T20: దక్షిణాఫ్రికాపై మాయని మచ్చ: టీమిండియా చెరిపేసుకుంటుందా?

 It will be their first ever T20 series win at home against South Africa, if India wins today.

బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్‌లో చిట్టచివరి మ్యాచ్.. ఈ సాయంత్రం జరుగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ సిరీస్‌లో ఇదే అయిదవది.. చివరిదీను. ఇందులో గెలిచిన వాడిదే సిరీస్. ప్రస్తుతం రెండు జట్లు రెండు చొప్పున విజయాలను సాధించాయి.. 2-2తో సమవుజ్జీగా నిలిచాయి. సిరీస్ విజేతను తేల్చేసే మ్యాచ్ కావడం వల్ల రసవత్తరంగా మారింది.

 మళ్లీ సమం.

మళ్లీ సమం.

దక్షిణాఫ్రికాపై టీమిండియాకు ఓ చెత్త రికార్డ్ ఉంది. దాన్ని చెరిపేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ దొరక్కపోవచ్చు. ఇప్పటివరకు భారత జట్టు.. స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఓడించలేదు. టీ20 ద్వైపాక్షిక సిరీస్‌ను గెలవలేదు. 2015లో ప్రొటీస్ టీమ్.. స్వదేశంలో భారత జట్టును ఓడించి- సగర్వంగా సిరీస్‌ను ఎగరేసుకెళ్లింది. మళ్లీ 2019లో సిరీస్‌ను సమం చేసుకుంది.

 దక్షిణాఫ్రికాను గెలవని..

దక్షిణాఫ్రికాను గెలవని..

ఆ చెత్త రికార్డ్‌ను చెరిపేసుకునే అవకాశం టీమిండియాకు లభించింది. ఈ సిరీస్ గెలిస్తే.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై ఉన్న మచ్చను చెరిపేసుకోవడానికి ఒక్క గెలుపు దూరంలో నిలిచింది. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో గెలిస్తే ఆ కొరత తీరిపోతుంది. తొలి రెండు మ్యాచ్‌లల్లో ఓడిన తరువాత భారత జట్టు మళ్లీ పుంజుకొంటుందని ఎవరూ ఊహించివుండకపోవచ్చు.

మంచి ఛాన్స్..

మంచి ఛాన్స్..

తొలి మ్యాచ్‌లో 200లకు పైగా స్కోర్‌ను ఛేదించి జోరు మీద కనిపించింది దక్షిణాఫ్రికా. రెండో మ్యాచ్‌ను కూడా అదే ఊపులో గెలిచేసింది. విశాఖపట్నంలో జరిగిన మూడో మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా చతికిలపడింది. ఊహించని విధంగా దక్షిణాఫ్రికా వెనుకంజ వేసింది. రాజ్‌కోట్ మ్యాచ్‌లోనూ అదే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో రెండు జట్లు రెండు చొప్పున విజయాలు సాధించాయి. 2-2తో సమంగా నిలిచాయి.

హెడ్ టు హెడ్

హెడ్ టు హెడ్

ఈ సాయంత్రం బెంగళూరులో జరిగే మ్యాచ్‌తో సిరీస్ విజేత ఎవరనేది తేలిపోతుంది. హెడ్ టు హెడ్ చూసుకుంటే.. ఆధిపత్యం టీమిండియాదే. ఇప్పటివరకు 19 టీ20ల్లో తలపడ్డాయి ఈ రెండు జట్లు. 11సార్లు విజయం భారత్‌ను వరించింది. ఎనిమిది మ్యాచ్‌లల్లో ఓడింది. బెంగళూరులో పడే అవకాశాలు ఉండటం కొంత నిరాశను కలిగించే విషయమే.

 68 శాతం ఛాన్స్..

68 శాతం ఛాన్స్..

ఇవ్వాళ కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాత్రి పూట వర్షం పడటానికి 68 శాతం వరకు ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. అదే జరిగితే మ్యాచ్ రద్దు కావచ్చు. అదే జరిగితే సిరీస్ ఎటూ తేలదు. రెండు జట్లూ సమవుజ్జీగా నిలుస్తాయి. ప్రస్తుతం బెంగళూరులో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84 శాతంగా రికార్డయింది. సాయంత్రానికి మరింత పెరగొచ్చనేది ఐఎండీ అంచనా.

Story first published: Sunday, June 19, 2022, 11:01 [IST]
Other articles published on Jun 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X