న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుభవం లేని పొరపాటు: స్మిత్‌ను ఔట్ చేసిన క్షణంలో యాసిర్ షా సంబరాలపై అక్రమ్

Australia vs Pakistan: ‘It was just an inexperienced mistake’ - Wasim Akram ‘worried’ by Yasir Shah’s send-off for Steve Smith

హైదరాబాద్: పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఇప్పటికే ముగియగా... అడిలైడ్ వేదికగా రెండో టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది. అయితే, బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(4) పరుగుల వద్ద పాక్ స్పిన్నర్ యాసిర్ షా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 10 బంతులను ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ పెవిలియన్‌కు చేరాడు. స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన తర్వాత యాసిర్ షా ప్రత్యేకమైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్‌ను యాసిర్ షా ఔట్ చేయడం ఇది ఏడోసారి. దీంతో యాసిర్ షా తన రెండు చేతులతో ఏడు సంఖ్యను చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు.

విండిస్ చేతిలో ఓటమి: ఏకైక టెస్టులో చెత్త రికార్డు నమోదు చేసిన ఆప్ఘన్విండిస్ చేతిలో ఓటమి: ఏకైక టెస్టులో చెత్త రికార్డు నమోదు చేసిన ఆప్ఘన్

అతిగా సంబరాలు చేసుకున్న యాసిర్ షా

అతిగా సంబరాలు చేసుకున్న యాసిర్ షా

అయితే, యాసిర్ షా ఈ విధంగా సంబరాలు చేసుకోవడాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ "ఇది కేవలం అనుభవం లేని పొరపాటు"గా అభివర్ణించాడు. ఆటగాళ్లు ఈ విధంగా సంబారలు జరుపుకునే ముందు ఆట యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోవాలని అక్రమ్ పాక్ క్రికెటర్లకు సూచించాడు.

మా కాలంలో మీకు తెలుసు

మా కాలంలో మీకు తెలుసు

యాసిర్ షా సంబరాలపై వసీం అక్రమ్ ఫాక్స్ స్పోర్ట్స్.కామ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో "మా కాలంలో మీకు తెలుసు, నేను ఆడినప్పుడు నేను ఎన్నిసార్లు ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేశానో. మా మనస్సుల్లో అదే చివరి విషయం. ఈ రోజుల్లో రికార్డులు, గణాంకాలు వంటి విషయాలు ప్రతి అభిమానికి తెలుసు" అని అన్నాడు.

బౌలర్‌గా ఆందోళన చెందుతున్నా

బౌలర్‌గా ఆందోళన చెందుతున్నా

"కానీ నేను బౌలర్‌గా (ఆందోళన చెందుతున్నాను) ‘నేను ఆటపై ప్రభావం చూపుతున్నానా లేదా? నేను పాకిస్థాన్ జట్టు తరఫున ఆట గెలిచానా లేదా దీనికి విరుద్ధంగా? 'కాకపోతే, నేను అతడిని ఏడుసార్లు ఔట్ చేసిన ప్రయోజనం లేదు. ఇది కేవలం అనుభవం లేని పొరపాటు. ఇదే విషయాన్ని నేను నమ్ముతున్నాను" అని వసీం అక్రమ్ అన్నాడు.

అడిలైడ్ వేదికగా డే నైట్ టెస్ట్

అడిలైడ్ వేదికగా డే నైట్ టెస్ట్

బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఐదు పరుగులు తేడాతో ఓడిపోయింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా డే నైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో పేసర్ మొహమ్మద్ అబ్బాస్‌కు చోటు దక్కగా.... ఇమ్రాన్ ఖాన్‌ను తుది జట్టు నుంచి సెలక్టర్లు తప్పించారు.

Story first published: Friday, November 29, 2019, 13:31 [IST]
Other articles published on Nov 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X