న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పూజారా డిఫెన్స్ దుర్భేద్యం, ఆసీస్ బౌలర్లను ఉతికారేశాడు: మయాంక్

India vs Australia 4 Test : Pujara Played Very Well During The Match : Mayank Agarwal | Oneindia
It was great to watch Pujara grinding the Australian bowlers: Mayank Agarwal

సిడ్నీ: ఆస్ట్రేలియాతో తలపడుతోన్న టీమిండియా.. నాలుగో టెస్టులో అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించిన భారత్.. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 300కు పైగా పరుగులు చేసింది. ఈ క్రమంలో యువ ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 77 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పూజారాకు చక్కని భాగస్వామ్యం అందించాడు. తొలి రోజు (గురువారం) మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. పూజారాను ప్రశంసల్లో ముంచెత్తాడు.

పుజారా బ్యాటింగ్‌‌ని చూడటం చాలా గొప్పగా

పుజారా బ్యాటింగ్‌‌ని చూడటం చాలా గొప్పగా

‘నాన్‌స్ట్రైక్ ఎండ్‌ నుంచి చతేశ్వర్ పుజారా బ్యాటింగ్‌‌ని చూడటం చాలా గొప్పగా అనిపించింది. తన బలంపై స్పష్టమైన అవగాహనతో ఉన్నాడు. ఏకాగ్రతను ఎక్కడా కోల్పోకుండా చక్కగా ఇన్నింగ్స్‌ని నిర్మించాడు. ఇలా పుజారా డిఫెన్స్‌ను దుర్భేద్యంగా కొనసాగించాడు. గతి తప్పిన బంతుల కోసం ఎదురుచూసిన అతను.. సమయం కోసం వేచి చూసి ఆస్ట్రేలియా బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగాడు' అని మయాంక్ అగర్వాల్ వెల్లడించాడు.

 తన బలంపై స్పష్టమైన అవగాహన

తన బలంపై స్పష్టమైన అవగాహన

భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా చతేశ్వర్ పుజారాకి తన బలంపై స్పష్టమైన అవగాహన ఉందంటూ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (130 బ్యాటింగ్: 250 బంతుల్లో 16ఫోర్లు) అజేయ సెంచరీ బాదాడు. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 303/4తో మెరుగైన స్థితిలో నిలిచింది.

క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ

క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ

ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే తొలి వికెట్‌గా కేఎల్ రాహుల్ (9: 6 బంతుల్లో 2ఫోర్లు) అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77: 112 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సులు)తో కలిసి రెండో వికెట్‌కి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ దాదాపు 32 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా‌కు వికెట్ దక్కనివ్వలేదు.

Story first published: Thursday, January 3, 2019, 17:04 [IST]
Other articles published on Jan 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X