నాయకుడిగా విఫలమయ్యా: సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో ఏడ్చేసిన స్మిత్ (వీడియో)

Posted By:
నాయకుడిగా విఫమయ్యా: సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో ఏడ్చేసిన స్మిత్
It was failure of my leadership, says emotional Steve Smith

హైదరాబాద్: 'నాయకుడిగా నేను పూర్తిగా విఫమయ్యా' బాల్ టాంపరింగ్ ఘటన అనంతరం స్వదేశానికి చేరుకున్న తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో స్టీవ్ స్మిత్ చెప్పిన మాటలివి. గురువారం సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్మిత్ భావోద్వేగానికి లోనయ్యాడు.

తాను చెప్పిన తప్పుకు అభిమానులను క్షమాపణలు కోరాడు. 'నేను ఎవరినీ నిందించడం లేదు. నేను ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌ని. గత శనివారం ఏదైతే జరిగిందో అందుకు కెప్టెన్‌గా జరిగిన పరిణామాలకు నాదే పూర్తి బాధ్యత. నాయకుడిగా నేను పూర్తిగా విఫలం అయ్యా' అని స్మిత్ కన్నీటి పర్యంతం అయ్యాడు.

'ప్రపంచంలో అత్యుత్తమ ఆటల్లో క్రికెట్ ఒకటి. క్రికెట్ నా జీవితం, మళ్లీ అడుగుపెడతా. నన్ను క్షమించండి, నేను పూర్తిగా నాశమయ్యా. నిర్ణయం పేరిట నేను ఘోర తప్పిదం చేశాను. పైగా దానిని కప్పి పుచ్చుకునేందుకు నేను చేసిన ప్రయత్నాలు నాకు మరింత నష్టాన్ని కలిగించాయి. ఈ తప్పు నన్ను జీవితం వెంటాడుతుంది' అని అన్నాడు.

'నాకు జరిగిన ఈ నష్టం వల్ల లాభం ఏదైనా ఉందా అంటే.. ఇది ఇతరులకు గుణపాఠం కావటమే. ఇది క్రీడా వ్యవస్థలో ఒక మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నా. క్రికెట్‌ నా జీవితం. మైదానంలో మళ్లీ త్వరగా అడుగుపెట్టాలని కొరుకుంటున్నా' అని స్మిత్‌ గద్గద స్వరం స్వరంతో చెప్పాడు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌న త‌ల్లితండ్రుల‌ను చూడ‌డం ఇబ్బందిక‌రంగా ఉంద‌ని, మంచి వ్య‌క్తులు త‌ప్పులు చేస్తుంటార‌ని, కానీ తాను ఓ పెద్ద త‌ప్పు చేసిన‌ట్లు స్మిత్ అంగీక‌రించాడు. దీని ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు కోరుతున్న‌ట్లు స్మిత్ తెలిపాడు. త‌న నాయకత్వంలోని జట్టు వల్ల ఆస్ట్రేలియాకు జ‌రిగిన న‌ష్టం ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ానని అన్నాడు.

కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మూడో రోజున బాల్ టాంపరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన స్మిత్‌ మ్యాచ్‌ వ్యూహంలోనే భాగంగా జట్టంతా కలిసి బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు చెప్పడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

దీనిపై విచారణకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ముగ్గురిపై కొరడా ఝులిపించింది. బాల్ టాంపరింగ్‌ వివాదంలో కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించింది. ఇక, బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన కామెరాన్‌ బాన్‌క్టాఫ్ట్‌పై తొమిది నెలల నిషేధం విధించింది.

దీంతో పాటు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా నిషేధం విధించింది. ఈ నిషేధంపై ఆటగాళ్లు మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే, బంతి ఆకారాన్ని మార్చేందుకు టేప్‌ను కాకుండా సాండ్‌పేపర్‌ను (గరుకైన కాగితాన్ని) ఉపయోగించినట్టు తమ విచారణలో తేలినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

అయితే వీరు క్రికెట్‌ను కొనసాగించేందుకు క్లబ్ క్రికెట్ మాత్రం ఆడొచ్చు. అంతేకాదు శిక్ష అమలు కాలంలో ఈ ముగ్గురూ కమ్యూనిటీ క్రికెట్‌లో వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని కూడా ఆదేశించారు. నిషేధ సమయంలో స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌ను క్లబ్ క్రికెట్‌లోనూ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు అర్హులు కాదని పేర్కొంది. డేవిడ్ వార్నర్ మాత్రం ఎప్పటికీ కెప్టెన్సీ చేపట్టే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, March 29, 2018, 15:07 [IST]
Other articles published on Mar 29, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి