న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

11 ఓవర్లు 34 పరుగులు.. బుమ్రా స్పెల్‌పై సంజనా ఏమందంటే? సిరాజ్ రియాక్షన్ హైలెట్!!

It was a fun day at work: Sanjana Ganesan response on Jasprit Bumrahs spell in WTC Final

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేస్ బౌలర్లు పూర్తిగా విఫలం అయ్యారు. సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్‌ శర్మలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కివీస్‌ ఓపెనర్లను ఔట్ చేసేందుకు ఈ త్రయంకు కష్టంగా మారింది. డేవాన్‌ కాన్వే (54; 153 బంతుల్లో), టామ్ లాథమ్‌ (30; 104 బంతుల్లో) స్వేచ్ఛగా ఆడుతూ తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం అందించారు. 34 ఓవర్లు ప్రయత్నించినా భారత్‌కు తొలి వికెట్‌ దక్కలేదు. భారత పేసర్లు ఎంత శ్రమించినా కాన్వే పరుగులు చేస్తూనే ఉన్నాడు.

ముంబై ఇండియన్స్ జట్టుకే బాగా ఆడుతావా

ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా విఫలమయ్యాడు. తన 11 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో డేవాన్‌ కాన్వే బౌండరీలు బాదాడు. బుమ్రా పరుగులు ఇస్తూ.. వికెట్లు తీయకపోవడం భారత అభిమానులకు మింగుడుపడడం లేదు. సోషల్ మీడియాలో అతడిపై మండిపడుతూన్నారు. ఐసీసీ మ్యాచులలో బుమ్రా సరిగ్గా ఆడడని, అతను ఓ చోకర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'ముంబై ఇండియన్స్ జట్టుకే బాగా ఆడుతావా?, భారత జట్టుకు ఆడవా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రా స్పెల్‌పై మీమ్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. అందులో సిరాజ్ రియాక్షన్ హైలెట్. బుమ్రా స్పెల్‌ చూసి సిరాజ్ ఏడుస్తున్నట్లు మీమ్స్ చేశారు.

ఇదొక ఫన్ డే

ఇక జస్ప్రీత్ బుమ్రా స్పెల్‌పై అతడి భార్య, కామెంటేటర్ సంజనా గణేశన్‌ స్పందించారు. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌తో వ్యాఖ్యానం చేస్తున్న ఓ ఫొటోను సంజనా పంచుకున్నారు. బుమ్రా స్పెల్‌పై మీ స్పందన ఏంటని సంజనాను అడగ్గా.. 'ఇదొక ఫన్ డే' అని సమాధానం ఇచ్చారు. ఇక కొందరు ఫాన్స్ బుమ్రాపై మండిపడుతుంటే.. మరికొందరు అతడికి మద్దతుగా నిలిచారు. ఒక్క మ్యాచుతో అతడిని నిందించాల్సిన అవసరం లేదని, బుమ్రా కచ్చితంగా రాణిస్తాడు అని కామెంట్లు చేస్టున్నారు. దీంతో బుమ్రా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

భువీ ఉంటే స్వింగ్ చేసేవాడుగా

భువీ ఉంటే స్వింగ్ చేసేవాడుగా

మరోవైపు సౌథాంప్టన్‌ వాతావరణం చల్లగా ఉండటంతో బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసే భువనేశ్వర్‌ కుమార్‌ ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని అభిమానులు అంటున్నారు. చల్లని వాతావరణం, మబ్బులు పట్టినప్పుడు భువీ బౌలింగ్‌ అత్యంత బాగుంటుందని పేర్కొంటున్నారు. అదనపు స్వింగ్‌ లభించే ఇంగ్లండ్‌లో అతడు కచ్చితంగా ప్రభావం చూపించేవాడని పోస్టులు చేస్తున్నారు. 'బుమ్రా, షమీ, ఇషాంత్‌ పేసర్లు.. స్వింగ్‌ చేసే భువీ ఉంటే బాగుండేది' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'భువీ స్వింగ్ మిస్ అవుతున్నాం' అని ఇంకొకరు పేర్కొన్నారు. ప్రస్తుతం నెట్టింట భువీ పేరు ట్రెండ్ అవుతోంది.

WTC Final 2021: బుమ్రా, షమీ, ఇషాంత్‌ పేసర్లే.. భువనేశ్వర్ అంతకుమించి!భువీ ఉంటే స్వింగ్ చేసేవాడుగా!

నాలుగో రోజు ఆట‌కు వ‌రుణుడు అడ్డు

నాలుగో రోజు ఆట‌కు వ‌రుణుడు అడ్డు

ఇక ఊహించిన‌ట్లే వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ నాలుగో రోజు ఆట‌కు వ‌రుణుడు అడ్డుప‌డుతున్నాడు. సోమ‌వారం ఉద‌యం నుంచి సౌథాంప్ట‌న్‌లో వ‌ర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎజియ‌స్ బౌల్ స్టేడియం మొత్తం క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. నాలుగో రోజు ఆట ప్రారంభం కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారం ప్ర‌కారం.. సోమ‌వారం రోజంతా వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో ఆట స‌జావుగా సాగ‌డం అనుమానమే.

Story first published: Monday, June 21, 2021, 16:35 [IST]
Other articles published on Jun 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X