Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021: బుమ్రా, షమీ, ఇషాంత్‌ పేసర్లే.. భువనేశ్వర్ అంతకుమించి!భువీ ఉంటే స్వింగ్ చేసేవాడుగా!

Indian Fans Feels Bhuvneshwar Kumar Could Have Been Right Choice For WTC Final 2021
WTC Final Day 4 : Bhuvneshwar స్వింగ్ మిస్ అవుతున్నాం IND మూల్యం చెల్లించుకుంది!! || Oneindia Telugu

హైదరాబాద్: భువనేశ్వర్‌ కుమార్‌.. టీమిండియా అత్యుత్తమ పేసర్లలో ఒకడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పిచ్‌లపై పచ్చిక.. వాతావరణం చల్లగా.. తేమతో వుంటే అతడిని ఆపడం కష్టమే. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తుంటాడు. ప్రస్తుతం భారత జట్టులోని సీనియర్లలో ఇన్‌ స్వింగర్‌, ఔట్ స్వింగర్‌లను వేయగల ఒకేఒక్కడు. ఇంగ్లండ్, న్యూజీలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. అలాంటి పేసర్‌ను భారత సెలక్షన్ కమిటీ కీలక పర్యటనకు పక్కనపెట్టి మూల్యం చెలించుకుంది.

34 ఓవర్లు ప్రయత్నించినా

34 ఓవర్లు ప్రయత్నించినా

ప్రస్తుతం జరుగుతున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, త్వరలో ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న సుదీర్ఘ ఫార్మాట్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ని బీసీసీఐ ఎంపిక చేయలేదు. భువీని తీసుకోకపోవడం ఎంత తప్పిదమో భారత జట్టుకు త్వరగానే తెలిసింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో తొలిఇ న్నింగ్స్‌లో భారత్ 217 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను ఔట్‌ చేయడం భారత బౌలర్లకు కష్టంగా మారింది. డేవాన్‌ కాన్వే (54; 153 బంతుల్లో), టామ్ లాథమ్‌ (30; 104 బంతుల్లో) తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం అందించారు. 34 ఓవర్లు ప్రయత్నించినా.. భారత్‌కు తొలి వికెట్‌ దక్కలేదు.

భువీ స్వింగ్ మిస్ అవుతున్నాం

భువీ స్వింగ్ మిస్ అవుతున్నాం

భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్‌ శర్మ ఎంత శ్రమించినా డేవాన్‌ కాన్వే పరుగులు చేస్తూనే ఉన్నాడు. హాఫ్ సెంచరీ చేసిన అనంతరం చివరికి ఇషాంత్‌ అతడిని ఔట్ చేశాడు. అయితే సౌథాంప్టన్‌ వాతావరణం చల్లగా ఉండటంతో బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసే భువనేశ్వర్‌ కుమార్‌ ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని అభిమానులు అంటున్నారు. చల్లని వాతావరణం, మబ్బులు పట్టినప్పుడు భువీ బౌలింగ్‌ అత్యంత బాగుంటుందని పేర్కొంటున్నారు. అదనపు స్వింగ్‌ లభించే ఇంగ్లండ్‌లో అతడు కచ్చితంగా ప్రభావం చూపించేవాడని పోస్టులు చేస్తున్నారు. 'బుమ్రా, షమీ, ఇషాంత్‌ పేసర్లు.. స్వింగ్‌ చేసే భువీ ఉంటే బాగుండేది' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'భువీ స్వింగ్ మిస్ అవుతున్నాం' అని ఇంకొకరు పేర్కొన్నారు. ప్రస్తుతం నెట్టింట భువీ పేరు ట్రెండ్ అవుతోంది.

WTC Final 2021: విరాట్ కోహ్లీనే కాదు.. ఆ బంతికి ఎవరైనా ఔట్ కావాల్సిందే: జేమీసన్‌

టెస్టు ఆడగలిగే ఫిట్‌నెస్ లేదని

టెస్టు ఆడగలిగే ఫిట్‌నెస్ లేదని

మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం, తరచూ గాయాల పాలవ్వడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయలేదని బోర్డు వర్గాల సమాచారం. రెండేళ్లు అతడు టెస్టు క్రికెట్‌ ఆడకపోవడం, రంజీల్లోనూ ప్రభావం చూపకపోవడం, దేశవాళీ క్రికెట్లోనూ ఎక్కువగా ఆడకపోవడాన్ని వారు పరిగణనలోకి తీసుకున్నారట. ఇంగ్లండ్ వంటి దేశాల్లో సుదీర్ఘ కాలం టెస్టు సిరీస్‌ ఆడగలిగే ఫిట్‌నెస్ భువీకి ఉన్నట్టు సెలక్టర్లు భావించడం లేదని సమాచారం. అందుకే టెస్ట్ ఫార్మాట్‌కు అతడిని ఎంపికచేయలేదు. శ్రీలంక పర్యటననూ దృష్టిలో పెట్టుకొని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదని మరో వాదన.

2018లో చివరి టెస్ట్

2018లో చివరి టెస్ట్

నిజానికి భువనేశ్వర్‌ కుమార్‌ రెండున్నరేళ్లుగా గాయాల బారిన పడుతున్నాడు. 2018 జనవరి నుంచి భువీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్టే ఆడలేదు. ఆ ఏడాది జనవరి 24-27 మధ్యన దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచే చివరిది. పరిమిత ఓవర్ల క్రికెట్లో డెత్‌ ఓవర్లలో అతడి సామర్థ్యం పెరగడంతో టీ20, వన్డేలకు ప్రాధాన్యం ఇచ్చారు. గతేడాది ఐపీఎల్‌లోనూ గాయపడటంతో కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. సయ్యద్‌ ముస్తాక్‌, విజయ్ హజారే ఆడటంతో ఇటీవల ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశం ఇచ్చారు. ఇక ఐపీఎల్ 2021లో ఆరంభ మ్యాచులు ఆడి మళ్లీ గాయపడ్డాడు. అయితే ఇప్పుడు కోలుకున్నాడు. ఏదేమైనా భువీ స్వింగ్ టీమిండియాకు కచ్చితంగా ఉపయోగపడేది. భారత్ తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు.

Story first published: Monday, June 21, 2021, 15:40 [IST]
Other articles published on Jun 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+