న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో మసాజ్‌ థెరపిస్ట్‌గా నవనీత గౌతమ్‌: ఏమైనా భయాలు ఉన్నాయా?

RCB's Only Female Member Brilliant Reply To Media ! || Oneindia Telugu
It’s like having 20 brothers around at all times, says RCB’s massage therapist Navnita Gautam

హైదరాబాద్: తన చుట్టూ ఎప్పుడైనా 20 మంది సోదరులు ఉన్న భావన కలిగిస్తుందని వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు మసాజ్‌ థెరపిస్ట్‌గా పనిచేయబోతున్న నవనీత గౌతమ్‌ వెల్లడించారు. ఇటీవలే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ సహాయక సిబ్బందిలో ఒక మహిళను తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆర్సీబీ మసాజ్‌ థెరపిస్ట్‌గా నవనీత గౌతమ్‌‌ను ఆ జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా ఓ మహిళకు అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి. ఇక ఐపీఎల్‌లో ఒక మహిళని సహాయక బృందంలో చేర్చుకున్న తొలి జట్టుగా బెంగళూరు రికార్డుల్లోకి ఎక్కింది. ఆర్‌సీబీ హెడ్‌ ఫిజియోథెరపిస్ట్‌ ఇవాన్‌ స్పీచ్‌లీ, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసులతో కలిసి నవనీత పని చేస్తుంది.

<strong>'ఐపీఎల్ ఆడటం మానేయి' - మిస్ పైర్ అయిన రోహిత్ శర్మ దీపావళి ట్వీట్</strong>'ఐపీఎల్ ఆడటం మానేయి' - మిస్ పైర్ అయిన రోహిత్ శర్మ దీపావళి ట్వీట్

కెనడాకు చెందిన నవనీత

కెనడాకు చెందిన నవనీత

కెనడాకు చెందిన నవనీతకు మసాజ్ థెరపిస్ట్‌గా ఇది మొదటి ఎస్సైన్మెంట్ కాదు. ఆమె గతంలో గ్లోబల్ టి20 కెనడాలో టొరంటో నేషనల్స్‌తో జట్టుతో కలిసి పనిచేసింది. ఆసియా కప్ సందర్భంగా భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టుతో కూడా కలిసి పనిచేసింది. అయితే, ఐపీఎల్‌ సహాయక సిబ్బందిలో భాగమైన మొదటి, ఏకైక మహిళగా నిలిచింది.

ఏమైనా భయాలు ఉన్నాయా?

ఏమైనా భయాలు ఉన్నాయా?

ఈ నేపథ్యంలో నవనీత గౌతమ్‌ని ఏమైనా భయాలు ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు "ఖచ్చితంగా కాదు. ఇది ఎప్పుడైనా 20 మంది సోదరులను కలిగి ఉండటం వంటిది" అని పేర్కొంది. అథ్లెట్లను తిరిగి మైదానంలోకి తీసుకురావడం కోసం ఆరోగ్య నిపుణులు అందరం కలిసి ఒక బృందంగా కలిసి పనిచేస్తున్నందు వల్ల జెండర్ అనేది సమస్య కాదని తెలిపారు.

జెండర్ అనేది సమస్య కాదు

జెండర్ అనేది సమస్య కాదు

"నెమ్మదిగా కానీ ఖచ్చితంగా, పరివర్తన జరుగుతోంది. క్రీడాకారులు మరియు సహాయక సిబ్బంది మీ పనిని విశ్వసించినంత కాలం, అథ్లెట్లను తిరిగి మైదానంలోకి తీసుకురావడం కోసం ఆరోగ్య నిపుణులు అందరం కలిసి ఒక బృందంగా కలిసి పనిచేస్తున్నందు వల్ల జెండర్ అనేది సమస్య కాదని నేను నమ్ముతున్నాను" అని నవనీత పేర్కొన్నారు.

టొరంటో నేషనల్స్‌తో అనుభవం అద్భుతం

టొరంటో నేషనల్స్‌తో అనుభవం అద్భుతం

"గ్లోబల్ టి20 లీగ్‌లో టొరంటో నేషనల్స్‌తో అనుభవం అద్భుతమైనది. ఇప్పుడు ఐపీఎల్‌కు మారడం సరదాగా ఉండాలి. ఇందులో ప్రతి ఒక్క అథ్లెట్ యొక్క శరీర రకం/కండరాల నాణ్యతతో పాటు వారి ఇష్టాలు... అయిష్టాలను అర్థం చేసుకోవడం ప్రధాన సవాళ్లలో ఒకటి. ఆ తర్వాత నుంచి ఇది చాలా సున్నితంగా సాగుతుందని అనుకుంటున్నా" అని ఆమె తెలిపారు.

Story first published: Monday, October 28, 2019, 18:23 [IST]
Other articles published on Oct 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X