న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బ్యాక్ ఫైర్' అవుతుందేమో!: ఆసీస్ పర్యటనలో టీమిండియా 2 డే నైట్ టెస్టులు ఆడటంపై చాపెల్

It may backfire, India have a strong attack: Ian Chappell on 2 Day-night Tests in Australia

హైదరాబాద్: 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియాతో 2 డే నైట్ టెస్టులు ఆడాలనే ఆలోచన ఆస్ట్రేలియాకు 'బ్యాక్ ఫైర్' అవుతుందేమోనని మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బలమైన బౌలింగ్ ఎటాక్‌ను కలిగి ఉందని తెలిపాడు.

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్‌కి రాసిన కాలమ్‌లో ఇయాన్ చాపెల్ "2020-21లో ఆస్ట్రేలియాలో భారత పర్యటన సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా రెండు డే నైట్ టెస్టుల గురించి ఆలోచిస్తోంది. ఇది ఆస్ట్రేలియాకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశ్యం అని భావిస్తే... టీమిండియా బలమైన బౌలింగ్ ఎటాక్‌ను కలిగి ఉన్నందున అది ఎదురుదెబ్బ తగలొచ్చు. కోహ్లీ ఇప్పటికే ప్రపంచంలో అత్యుత్తమ కెప్టెన్‌ అని చూపించాడు" అని అన్నాడు.

వీడియో: వన్‌డౌన్‌లో శివమ్ దూబేని పంపడం వెనుక ప్రధాన కారణమిదే!వీడియో: వన్‌డౌన్‌లో శివమ్ దూబేని పంపడం వెనుక ప్రధాన కారణమిదే!

"ఇక్కడ విషయం ఏంటంటే టీమిండియా ఆడిన తొలి డే నైట్ టెస్టులో చాలా సులభంగా గెలిచారు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ప్రదర్శన దానికి కొనసాగింపుగా సరైన దశలో ఇక్కడ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ డే నైట్ టెస్టు మ్యాచ్‌లనే వారు పరిశీలిస్తారనడంలో ఎటువంటి నాకు ఎలాంటి సందేహం లేదు. జవవరిలో టీమిండియాతో తలపడేటప్పుడు అదే జరుగుతుంది" అని చాపెల్ చెప్పుకొచ్చాడు.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఇందులో భాగంగా టీమిండియాతో ఒకటి కంటే ఎక్కువ డే నైట్ టెస్టులు ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2 డే నైట్ టెస్టులు ఆడటం "కొంచెం ఎక్కువ" అని సౌరవ్ గంగూలీ అన్న సంగతి తెలిసిందే.

త్వరలో పెళ్లి మోగనున్న పెళ్లి బాజాలు: అజహర్ కోడలు కానున్న సానియా మిర్జా చెల్లిత్వరలో పెళ్లి మోగనున్న పెళ్లి బాజాలు: అజహర్ కోడలు కానున్న సానియా మిర్జా చెల్లి

జనవరి 14 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సీఏ చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ నేతృత్వంలోని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం బీసీసీఐ ప్రతినిధులతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఒకటి కంటే ఎక్కువ డే నైట్ టెస్టులపై ప్రతిపాదన తీసుకురానున్నట్టు సమాచారం.

Story first published: Monday, December 9, 2019, 15:26 [IST]
Other articles published on Dec 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X