న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇది అన్యాయం సారూ.. ధావన్‌‌పై ఎందుకింత వివక్ష..? కెప్టెన్సీ మార్పు పట్ల నెటిజన్ల సూటి ప్రశ్నలు

It Is Completely Unfair, Netizens Fires on BCCI For Demoting Dhawan
అన్యాయం... కెప్టెన్సీ మార్పు పట్ల నెటిజన్ల విమర్శలు *Cricket | Telugu OneIndia

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గురువారం ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో అతన్ని హుటాహుటిన జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో ఆడేంచేందుకు బీసీసీఐ ఎంపిక చేయడంతో పాటు.. కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పజెప్పుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే శిఖర్ ధావన్‌ను ఇప్పటికే కెప్టెన్‌గా ప్రకటించిన బీసీసీఐ అతని నుంచి కెప్టెన్సీ లాక్కుని కేఎల్ రాహుల్‌కు అప్పజెప్పింది. రాహుల్ డిప్యూటీగా ధావన్‌ను వైస్ కెప్టెన్సీ హోదాలో నియమించింది. గాయాలు, ఆపరేషన్, ఫిట్ నెస్, కరోనా తదితర కారణాల వల్ల టీమిండియాకు దూరమైన రాహుల్ తాజాగా ఫిట్ నెస్ సాధించి జట్టులోకి ఎంపికయ్యాడు. రాహుల్ ఎంపిక పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ రాహుల్ కంటే ఎంతో సీనియర్ అయిన శిఖర్ ధావన్‌ను కెప్టెన్సీ నుంచి ఇంత హఠాత్తుగా పీకిపాడేయడం పట్ల నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీసీఐపై సీరియస్ అవుతున్నారు.

తొలుత రాహుల్ ఎంపిక కాలేదు

తొలుత జింబాబ్వే పర్యటనకు రాహుల్ ఎంపిక కాలేదు. అతను ఎందుకు ఎంపిక కాలేదో కూడా అప్పట్లో ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు. 'హే గాయ్స్ నా ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి నేను కొన్ని విషయాలపై ఓ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. జూన్‌లో నాకు జరిగిన ఆపరేషన్ విజయవంతమైంది. వెస్టిండీస్‌ పర్యటన కోసం జాతీయ జట్టులోకి తిరిగి రావాలనే ఆశతో నేను నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ కూడా ప్రారంభించాను. దురదృష్టవశాత్తు నేను పూర్తి ఫిట్‌నెస్‌ దశకు చేరుకునే టైంలో నాకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఫలితంగా మళ్లీ నేను ఎప్పటిలాగే మొదటికొచ్చాను. కోవిడ్ తగ్గాక కొన్ని వారాల పాటు మళ్లీ ఫిట్‌నెస్ శిక్షణ తీసుకుని మళ్లీ జట్టుకు అందుబాటులోకి వస్తా' అని సదరు ట్వీట్లో రాహుల్ పేర్కొన్నాడు. తాజాగా రాహుల్ ఫిట్ నెస్ టెస్ట్ పాస్ కావడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఏకంగా జింబాబ్వే వన్డే సిరీస్‌కు కెప్టెన్సీ హోదా కూడా వచ్చింది.

ధావన్ ఏమనడనే కదా..?

ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో ధావన్ సారథ్యంలో టీమిండియా 3-0తేడాతో వన్డే సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో ధావన్ వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా మంచి ప్రదర్శన చేశాడు. వన్డే ఫార్మాట్లో తాను రెగ్యులర్ ప్లేయర్ కూడా. అయితే ధావన్‌ పట్ల బీసీసీఐ తాజాగా వ్యవహరించిన విధానం అభిమానులకు నచ్చట్లేదు. అల్రెడీ అతనే కెప్టెన్ అని ప్రకటించాక.. రాహుల్ కోలుకున్నాడని అతన్ని వెంటనే తప్పించడమేంటీ? అతనేం రాహుల్ కన్నా జూనియర్ కాదు కదా.. మోస్ట్ సీనియర్ ప్లేయర్. ఇంతకుముందు కెప్టెన్సీ వహించిన అనుభవముంది. అయినా అవేమీ పట్టకుండా బీసీసీఐ ఎందుకిలా డిమోట్ చేస్తుంది. ధావన్ అయితే ఏం చేసినా సర్దుకుపోతాడు ఏమనడు అనడనే కదా ఇంత తెగింపుకొచ్చింది అంటూ బీసీసీఐ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఉన్నపలంగా తప్పించడమేంటీ.. షేమ్ ఆన్ యూ బీసీసీఐ

ఓ నెటిజన్ మరోసారి ధావన్ పట్ల బీసీసీఐ వివక్ష బట్టబయలైంది. సీనియర్ ప్లేయర్‌ పట్ల ఇలాంటి వైఖరి అస్సలు ఊహించలేదు. షేమ్ అన్ యూ బీసీసీఐ అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్.. అనౌన్స్ మెంట్ చేసి ఉన్నపలంగా తప్పిస్తే ఓ సీనియర్ ప్లేయర్ ఎంత డిస్సాపాయింట్ అవుతాడు.. కాస్త ఆలోచించాలి కదా అంటూ బుద్ధి చెప్పాడు. ఇంకో నెటిజన్.. ధావన్ కెరీర్‌కు ముగింపు పలకడానికి ఇదో ఎత్తుగడ అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు. ఇంకొకరు ఇది అన్యాయమని పేర్కొన్నాడు. ఇంతకీ ధావన్‌ను ఉన్నపలంగా తప్పించి.. డిమోషన్‌కు గురి చేయడం ఎంత వరకు కరెక్టో ప్రేక్షకులే చెప్పాలి.

Story first published: Thursday, August 11, 2022, 22:50 [IST]
Other articles published on Aug 11, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X