జట్టు సమతూకంగా ఉంటే కెప్టెన్సీ సులభమే: భువనేశ్వర్‌

జట్టు సమతూకంగా ఉంటే కెప్టెన్సీ చేయడం సులభమే, నేను ఎప్పుడూ ఇదే నమ్ముతాను అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ భువనేశ్వర్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. అయితే సన్‌రైజర్స్‌ రెగ్యులర్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ గాయంతో జట్టుకు దూరమవడంతో.. బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

టాస్‌ గెలవడం కలిసొచ్చింది:

టాస్‌ గెలవడం కలిసొచ్చింది:

మ్యాచ్ అనంతరం భువనేశ్వర్‌ మాట్లాడుతూ... జట్టు సమతూకంగా ఉండి సమష్టిగా రాణిస్తే కెప్టెన్సీ చేయడం సులభమవుతుంది.. నేను ఇదే నమ్ముతాను. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలవడం కలిసొచ్చింది. టాస్ వేసే ముందు పిచ్ ఎలా ఉందొ తెలియదు. అయితే డిల్లీ బ్యాటింగ్‌ చేసే సమయంలో ఎలా స్పందిస్తుందో పరిశీలించాం' అని భువనేశ్వర్‌ తెలిపారు.

బ్యాటింగ్ అంత సులువు కాదు:

బ్యాటింగ్ అంత సులువు కాదు:

'చివరి రెండు మ్యాచుల్లోనూ పిచ్‌లు ఒకే విధంగా ఉన్నాయి. ఈ పిచ్‌పై బ్యాటింగ్ అంత సులువు కాదు. 150 పరుగుల లక్ష్యం ఉంటే ఛేదన కష్టమే అని భావించి.. ప్రణాళిక ప్రకారం ఢిల్లీని ఆలోపే కట్టడి చేశాం. భారత దేశ వ్యాప్తంగా రెండవ భాగంలో పిచ్ నెమ్మదిస్తుంది. స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని' భువి అభిప్రాయపడ్డాడు.

బెయిర్‌స్టో శుభారంభం ఇచ్చాడు:

బెయిర్‌స్టో శుభారంభం ఇచ్చాడు:

'బ్యాటింగ్‌లో మా బ్యాట్స్‌మెన్‌ రాణించారు. ముఖ్యంగా బెయిర్‌స్టో అద్భుతంగా ఆడి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. దీంతో జట్టు విజయం దిశగా వెళ్ళింది. కేన్ ఆడదానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మేము విశ్రాంతి ఇచ్చాం' అని భువనేశ్వర్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు.

ఢిల్లీ సాధారణ స్కోర్:

ఢిల్లీ సాధారణ స్కోర్:

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగుల సాధారణ స్కోర్ చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే రాణించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, నబీ, సిద్దార్థ్‌ కౌల్‌ఖ తలో రెండు వికెట్లు తీశారు. లక్ష ఛేదనలో బెయిర్‌ స్టో(48) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే బెయిర్‌ స్టో అవుటయిన తర్వాత వార్నర్‌(10), విజయ్‌ శంకర్‌(16), పాండే(10), హుడా(10)లు నిరాశపరిచినా.. నబీ (17) మ్యాచ్‌ను ముగించాడు. దీంతో హైద్రాబాదు జట్టు హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, April 5, 2019, 13:01 [IST]
Other articles published on Apr 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X