న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను చూసిన వారిలో రికీ పాంటింగే అత్యుత్త‌మ కోచ్: టీమిండియా సీనియర్ పేసర్

Ishant Sharma reveals name of best coach he has ever met

ఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌పై టీమిండియా సీనియర్‌ పేసర్ ఇషాంత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తానిప్ప‌టి వ‌ర‌కు చూసిన వారిలో రికీ పాంటింగే అత్యుత్త‌మ కోచ్ అని ఇషాంత్ శ‌ర్మ పేర్కొన్నాడు. ఆట‌గాళ్ల‌కు మ‌ద్ద‌తుగా నిలువ‌డంలో పాంటింగ్ త‌ర్వాతే మ‌రెవ‌రైనా అని లంబూ తెలిపాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాత‌నిధ్యం వ‌హిస్తున్న ఇషాంత్.. సోమ‌వారం ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడాడు.

<strong>భారత క్రికెటర్లకు 6-8 వారాల క్యాంప్.. టెస్టులు మరింత కఠినం!!</strong>భారత క్రికెటర్లకు 6-8 వారాల క్యాంప్.. టెస్టులు మరింత కఠినం!!

రికీ అండ‌గా నిలిచాడు:

రికీ అండ‌గా నిలిచాడు:

'గడేడాది ఐపీఎల్‌లో ఆడేందుకు జట్టులో చేరినప్పుడు కాస్త ఇబ్బందిపడ్డాను. ఢిల్లీ క్యాపిట‌ల్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌వేశించిన‌ప్పుడు అంతా కొత్త‌గా అనిపించింది. అప్పుడే కెరీర్ ఆరంభించిన కొత్త కుర్రాడిలా బిత్త‌ర చూపులు చూస్తున్న నాకు రికీ పాంటింగ్ అండ‌గా నిలిచాడు. అత‌డితో మాట్లాడిన అనంత‌రం నా ఆత్మ‌విశ్వాసం వెయ్యిరెట్లు పెరిగింది. సీనియర్‌గా ఎలా ఉండాలో నేర్పాడు. అతని సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి' అని ఇషాంత్‌ తెలిపాడు.

పాంటింగ్ అలా అన‌డంతో ఫుల్ జోష్ వ‌చ్చింది

పాంటింగ్ అలా అన‌డంతో ఫుల్ జోష్ వ‌చ్చింది

'నా మొద‌టి చాయిస్ ఎప్పుడూ నువ్వే. సీనియ‌ర్‌వి కాబ‌ట్టి కొత్త కుర్రాళ్ల‌కు దారి చూపించు అని పాంటింగ్ అన‌డంతో ఫుల్ జోష్ వ‌చ్చింది. ఇక పాంటింగ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కొన‌సాగుతున్న‌ప్పుడు ఎక్కువ సార్లు అత‌డిని ఔట్ చేయ‌డాన్ని ఎప్ప‌టికీ మ‌రువ‌లేను. పెర్త్ టెస్టులో అత‌డికి బౌలింగ్ చేసిన విధానం, ఆ త‌ర్వాత భార‌త ప‌ర్య‌ట‌న‌లో పంట‌ర్ ఇబ్బంది పెట్టిన తీరు నా కెరీర్‌లోనే చాలా గొప్ప‌వి' అని ఇషాంత్‌ పేర్కొన్నాడు.

జూనియర్లకు మార్గనిర్దేశకం

జూనియర్లకు మార్గనిర్దేశకం

ప్రసుతం భారత టెస్టు జట్టులో రెగ్యులర్‌ బౌలర్‌ అయిన ఇషాంత్‌ శర్మ నిలకడగా రాణిస్తున్నాడు. అంతేకాదు జూనియర్లకు మార్గనిర్దేశకం చేస్తున్నాడు. ఇక గత సీజన్‌లో ఢిల్లీ తరుపున 13 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్‌ 13 వికెట్లు పడగొట్టాడు. ప్ర‌స్తుతం పాంటింగ్ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్ర‌ధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. లంబూ భారత్ తరఫున 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు.

అలవాటు పడాల్సిందే:

అలవాటు పడాల్సిందే:

కరోనా వైరస్ నేపథ్యంలో లాలాజలం, చెమట వాడడంపై ఐసీసీ నిషేధం విధిస్తే.. బంతిని మెరుపు తెప్పించేందుకు కొత్త పద్ధతులకు అలవాటు పడాల్సిందేనని ఇషాంత్ ‌శర్మ అన్నాడు. 'లాలాజలం, చెమట వాడకపోతే మన కోరుకున్నట్లుగా బంతి మెరుపు రాదు. కానీ కరోనా కారణంగా వీటిని వాడడంపై నిషేధం ఉంటే కొత్త పద్ధతులకు క్రికెటర్లు అలవాటు పడాల్సిందే' అని ఇషాంత్‌ చెప్పాడు.

Story first published: Tuesday, May 19, 2020, 16:47 [IST]
Other articles published on May 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X