న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అర్జున అవార్డుకు ఇషాంత్‌!!

Ishant Sharma, Atanu Das Among 29 Recommended For Arjuna Award

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు టీమిండియా సీనియర్ పేసర్‌ ఇషాంత్‌ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇషాంత్‌తో పాటు ఆర్చర్‌ అతాను దాస్‌, హాకీ క్రీడాకారిణి దీపికా ఠాకూర్‌, క్రికెటర్‌ దీపక్‌ హుడా, టెన్నిస్‌ ప్లేయర్‌ దివిజ్‌ శరన్‌ సహా 29 మంది అథెట్ల పేర్లను ఈ పురస్కారానికి నామినేట్‌ చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్ 2016 నుంచి ఈ ఏడాది మే వరకు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం అగ్రస్థానంలో ఉండటంలో ఇషాంత్ సమగ్ర పాత్ర పోషించాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలతో కలిసి టెస్టుల్లో భారత పేస్ అటాక్‌లో అతను ప్రధాన సభ్యుడిగా ఉన్నాడు. 31 ఏళ్ల ఇషాంత్‌ శర్మ 97 టెస్టులు, 80 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీశాడు.

ప్రముఖ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జత సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, ప్రముఖ టెన్నిస్ ఆటగాడు దివిజ్ శరణ్ కూడా సిఫారసు జాబితాలో చేర్చబడ్డారు. రికర్వ్ ఆర్చర్ అతను దాస్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మాధురికా పట్కర్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

రియో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, వరల్డ్‌ చాంఫియన్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను పేర్లను కూడా ఈ అవార్డుకు పరిశీలించగా చివరి నిమిషంలో పక్కకుపెట్టినట్లు సమాచారం. రియో ఒలంపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన సాక్షి 2016లో క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న పొందగా.. మీరాబాయి 2018లో ఈ అవార్డు అందుకున్నారు. ఈ కారణంతో వారి పేర్లను క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

జీవితకాల సాఫల్య అవార్డు ధ్యాన్‌చంద్‌' కోసం కమిటీ పంపించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మహిళా బాక్సర్‌ నగిశెట్టి ఉష కూడా ఉన్నారు. వైజాగ్‌కు చెందిన 36 ఏళ్ల ఉష 2006 ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజతం, 2008 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం, 2008 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆరుసార్లు సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆట నుంచి రిటైరయ్యాక ఉష 2013 నుంచి 2017 మధ్యకాలంలో పలువురు మహిళా బాక్సర్లకు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖ లోకో షెడ్‌లో పని చేస్తున్నారు.

చెలరేగిన సునీల్ నరైన్.. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ట్రినిబాగో సూపర్ విక్టరీ!!చెలరేగిన సునీల్ నరైన్.. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ట్రినిబాగో సూపర్ విక్టరీ!!

Story first published: Wednesday, August 19, 2020, 8:32 [IST]
Other articles published on Aug 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X