న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ గడ్డానికి ఇన్సూరెన్స్?: సీక్రెట్‌‌ బయటపెట్టిన కేఎల్ రాహుల్

By Nageshwara Rao
Kl Rahul Posts Video That Virat Kohli's Beard Got Insuranced
 Is Virat Kohli insuring his beard? Leaked CCTV Footage is going viral

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా గడ్డంతో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు తాను గడ్డంతోనే ఉండటం ఇష్టం కాబట్టి గడ్డాన్ని పెంచుతున్నట్లు గతంలో కోహ్లీ వెల్లడించాడు.

గతేడాది ఐపీఎల్ సందర్భంగా 'బ్రేక్ ద బియర్డ్' ఛాలెంజ్ ఎంతో పాపులర్ అయింది. చాలా మంది క్రికెటర్లు ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి గడ్డం తీసి ఒకరి తర్వాత మరొకరికి ఛాలెంజ్‌లు విసురుకున్న సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ దగ్గరకు వచ్చే సరికి తాను గడ్డం తీయలేనని చెప్పడం జరిగింది.

దీనికి అనుష్క శర్మ స్పందిస్తూ 'నువ్వు తీయలేవు' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ పెట్టింది. అయితే, విరాట్ కోహ్లీ తన గడ్డాన్ని తీయకపోవడం పెద్ద కథే ఉంది. అందుకు సంబంధించిన రహాస్యాన్ని టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ బయట పెట్టాడు.

కోహ్లీ గడ్డం సీక్రెట్‌ను బయటపెట్టిన కేఎల్ రాహుల్

ఆ రహస్యం ఏంటంటే విరాట్ కోహ్లీ తన గడ్డానికి ఇన్సూరెన్స్ చేయించుకోవమే. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని కేఎల్ రాహుల్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 'నీ గడ్డం నిన్ను బాగా విసిగిస్తుందని నాకు తెలుసు. నీ గడ్డానికి ఇన్సూరెన్స్ తీసుకున్నావన్న ఈ వార్త నేను చెప్పిన విషయాన్ని నిజం చేసింది' అంటూ రాహుల్ కామెంట్ పెట్టాడు.

కోహ్లీ గడ్డానికి సంబంధించి ఓ వ్యక్తి కొలతలు

కోహ్లీ గడ్డానికి సంబంధించి ఓ వ్యక్తి కొలతలు

సీసీటీవి పుటేజికి చెందిన ఈ వీడియోలో విరాట్ కోహ్లీ గడ్డానికి సంబంధించి ఓ వ్యక్తి కొలతలు తీసుకుంటుంటే.. మరో వ్యక్తి కోహ్లీని ఫొటోలు తీయడాన్ని మనం చూడొచ్చు. ఇదిలా ఉంటే, బుధవారం ఫోర్బ్స్‌ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలో అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్ల జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు లభించింది.

ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్-100 జాబితాలో కోహ్లీ

ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్-100 జాబితాలో కోహ్లీ

భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ఆటగాడు విరాట్ కోహ్లీనే. 24 మిలియన్ల డాలర్ల ఆదాయంతో ఫోర్బ్స్‌ జాబితాలో కోహ్లీ 83వ స్థానంలో నిలిచాడు. 4 మిలియన్ల డాలర్లను వేతనంగా అందుకుంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మిగతా 20 మిలియన్‌ డాలర్లను వ్యాపార ప్రకటనల ఒప్పందాల ద్వారా సంపాదిస్తున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలకు చెందిన ఆటగాళ్లు

ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలకు చెందిన ఆటగాళ్లు

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ సెంటర్లు, బ్రాండెడ్‌ దుస్తులు, ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ ఫ్రాంచైజీలు, ఆడియో ఎక్విప్‌మెంట్‌ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్‌ 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 1 మధ్య ఆటగాళ్లు పొందిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫోర్బ్స్‌ ఈ జాబితాను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలకు చెందిన ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

అమెరికా నుంచి 66 మంది క్రీడాకారులు

అమెరికా నుంచి 66 మంది క్రీడాకారులు

అత్యధికంగా అమెరికా నుంచి 66 మంది క్రీడాకారులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో అమెరికాకు చెందిన బాక్సింగ్‌ దిగ్గజం ఫ్లాయడ్‌ మేవెదర్‌ 285 మిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్ మెస్సీ(111 మిలియన్‌ డాలర్లు) రెండో స్థానంలో నిలవగా, పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(108 మిలియన్‌ డాలర్లు)తో మూడో స్థానంలో నిలిచాడు.

Story first published: Friday, June 8, 2018, 18:34 [IST]
Other articles published on Jun 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X