న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి బౌలింగ్ చేయడం అంత సులభం కాదు: ఆడమ్ జంపా ప్రశంసలు

Is Virat Kohli Adam Zampas bunny? Aussie spinner speaks up after dismissing Indian skipper again

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసీస్ స్పిన్నర్ ఆడమ్‌ జంపా ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ ఓ అద్భుతమైన ఆటగాడని పేర్కొన్న జంపా, అతడికి బౌలింగ్ చేయడం అంత సులభం కాదని మూడో వన్డే విజయానంతరం విలేకరులతో మీడియా సమావేశంలో చెప్పాడు.

ఆఖరి ఓవర్లో మూడు పరుగులు చేయలేక... ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి ఆఖరి ఓవర్లో మూడు పరుగులు చేయలేక... ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి

ఈ సందర్భంగా జంపా మాట్లాడుతూ "విరాట్ కోహ్లీ చాలా సీరియస్ బ్యాట్స్‌మెన్. మ్యాచ్‌లో కీలకమైన అతని వికెట్ తీయడం చాలా సంతోషంగా ఉంది. సులువుగా నా బౌలింగ్‌‌లో అతను ఔటవుతాడనే అభిప్రాయాన్ని నేను ఒప్పుకోను. కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం. నేను కూడా ఒకింత ఒత్తిడికి గురయ్యాను" అని అన్నాడు.

మరిన్ని బౌండరీలు కొట్టి ఉంటే?

మరిన్ని బౌండరీలు కొట్టి ఉంటే?

"నా ఓవర్‌లో అతను మరో మరిన్ని బౌండరీలు కొట్టి ఉంటే? మ్యాచ్ పూర్తిగా భారత్‌వైపు తిరిగిపోయేది" అని జంపా అన్నాడు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో(టీ20 సిరీస్‌తో కలుపుకుని) జంపా బౌలింగ్‌లో కోహ్లీ మూడుసార్లు ఔటయ్యాడు. రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో జంపా బౌలింగ్‌లోనే కోహ్లీ పెవిలియన్‌ చేరాడు.

మూడో వన్డేలో 123 పరుగులు చేసిన కోహ్లీ

మూడో వన్డేలో 123 పరుగులు చేసిన కోహ్లీ

కాగా, రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ 95 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 123 పరుగులు సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 41వ సెంచరీ కాగా ఈ సిరిస్‌లో వరుసగా రెండోది కావడం విశేషం. మూడో వన్డేలో కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4000 పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

డివిలియర్స్ రికార్డు బద్దలు

డివిలియర్స్ రికార్డు బద్దలు

కెప్టెన్‌గా 4000 పరుగులు సాధించడానికి కోహ్లీకి పట్టిన ఇన్నింగ్స్‌ 63. దీంతో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్‌‌కు నాలుగువేల పరుగులు సాధించడానికి 77 ఇన్నింగ్స్‌లు పట్టాయి. 100 ఇన్నింగ్స్‌ల్లో నాలుగువేల పరుగులు చేసిన ధోని ఈ జాబితాలోమూడో స్థానంలో ఉన్నాడు.

నాలుగో భారత క్రికెటర్‌గా కోహ్లీ

నాలుగో భారత క్రికెటర్‌గా కోహ్లీ

అయితే వన్డేల్లో కెప్టెన్‌గా నాలుగువేల పరుగులు సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. రాంచీ వన్డేలో 27 పరుగులు చేయగానే కోహ్లీ నాలుగువేల పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో భారత్ తరుపున ధోనీ (6641), మహ్మద్ అజారుద్దీన్ (5239), సౌరభ్ గంగూలీ (5104) కెప్టెన్‌గా నాలుగువేలకు పైగా పరుగులు సాధించారు. మొత్తంగా వన్డేల్లో 4 వేల పరుగులు సాధించిన 12వ కెప్టెన్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 2019లో ఇప్పటికే 500 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది విరాట్ 60 శాతానికిపైగా సగటుతో పరుగులు రాబట్టాడు.

Story first published: Sunday, March 10, 2019, 12:30 [IST]
Other articles published on Mar 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X