న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అదరగొట్టారుగా.. అమ్రిష్‌పురి పాత్రలో ఇర్ఫాన్‌.. రాజ్‌కుమార్‌ పాత్రలో యూసుఫ్‌ (వీడియో)!!

Irfan Pathan shows off acting skills with brother Yusuf Pathan

డిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం క్రీడా రంగంపై భారీగానే పడింది. ఇప్పటికే అన్ని టోర్నీలు, సిరీస్‌లు, పర్యటనలు రద్దయ్యాయి. అంతేకాకుండా వరుసగా పదకొండు రోజులు ప్రపంచవ్యాప్తంగా ఒక్క క్రికెట్‌ టోర్నీ జరగలేదు. టోర్నీలు, ప్రాక్టీస్‌ సెషన్స్‌ లేకపోవడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తాము చేస్తున్న పనులు, కుటుంబంతో సరదాగా గడుపుతున్న విషయాలను అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

<strong>'పురుషులతో సమానంగా మహిళకు వేతనాలు ఇవ్వాలి'</strong>'పురుషులతో సమానంగా మహిళకు వేతనాలు ఇవ్వాలి'

అమ్రిష్‌పురి పాత్రలో ఇర్ఫాన్‌

అమ్రిష్‌పురి పాత్రలో ఇర్ఫాన్‌

కరోనా పుణ్యమాని టీమిండియా పఠాన్‌ సోదరులు తమలోని కళా నైపుణ్యాలని ప్రదర్శించారు. ఆదివారం 'జనతా కర్ఫ్యూ' సందర్భంగా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తన సోదరుడు యూసుఫ్‌ పఠాన్‌తో కలిసి ఓ వీడియో రూపొందించారు. పఠాన్‌ సోదరులు బాలీవుడ్‌ సినిమా 'సూర్య'లోని ఓ సన్నివేశాన్ని తీసుకొని అద్భుతంగా నటించారు. యూసుఫ్‌ పఠాన్‌ రాజ్‌కుమార్‌ పాత్రలో.. ఇర్ఫాన్‌ పఠాన్‌ అమ్రిష్‌పురి పాత్రలో ఆకట్టుకున్నారు.

 హాత్‌ తొ మిలా లేతా లాలా

హాత్‌ తొ మిలా లేతా లాలా

'హాత్‌ తొ మిలా లేతా లాలా' అనే డైలాగ్‌తో కూడిన ఈ వీడియోను ఇర్ఫాన్‌ తన సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశాడు. మొదటగా ఇర్ఫాన్‌ షేక్ హ్యాండ్ ఇవ్వబోగా.. యూసుఫ్‌ అందుకు నిరాకరిస్తాడు. నేను పరిచయం లేని వ్యక్తులతో చేతులను కలపను అని యూసుఫ్‌ అనగా.. నేను కూడా ఇంతసేపు నిలబడలేను అని ఇర్ఫాన్‌ అంటాడు. అక్కడితో వీడియో ముగుస్తుంది. శనివారం కూడా ఒక టిక్‌టాక్‌ వీడియో చేసి దానిని కూడా అభిమానులతో ఇర్ఫాన్‌ పంచుకున్నాడు.

ఈ రాత్రి అలా చేయవద్దు

ఈ రాత్రి అలా చేయవద్దు

మరోవైపు కరోనా వైరస్‌ను అరికట్టడానికి ప్రజలు సామాజిక దూరం పాటించాలని, అలాగే పలు జాగ్రత్తలు తీసుకోవాలని మరో వీడియోలో ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి ప్రభుత్వ హెచ్చరికలను పాటించాలని విజ్ఞప్తి చేశాడు. 'మేము 2007 మరియు 2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు ఆ రాత్రి రోడ్డుపైకి వచ్చి సంబరాలను జరుపుకున్నాం. ఈ రాత్రి మాత్రం అలా చేయవద్దు' అని మరో ట్వీట్‌లో ఇర్ఫాన్‌ చెప్పాడు.

క్రికెట్‌కు రిటైర్మెంట్

ఇర్ఫాన్ పఠాన్ గత జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 19 ఏళ్ల వయస్సులో 2003లో అరంగేట్రం చేసిన ఇర్పాన్.. భారత్ తరఫున తన కెరీర్‌లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి 301 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టెస్టుల్లో 1105 పరుగులు, వన్డేల్లో 1544 పరుగులు సాధించాడు. టీమిండియా అందించిన ఉత్తమ ఎడమచేతివాటం స్వింగ్ బౌలర్ ఇర్ఫాన్ పఠానే. సుమారు తొమ్మిదేళ్ల పాటు ఇర్ఫాన్ భారత్‌ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Monday, March 23, 2020, 12:03 [IST]
Other articles published on Mar 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X