న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌ కెప్టెన్సీ సూపర్.. గంగూలీ, ధోనీ కలబోతే హిట్‌మ్యాన్: పఠాన్

Irfan Pathan says Rohit Sharma is a mixture of Sourav Ganguly and MS Dhoni
Captain Rohit Sharma Is A Mix Of MS Dhoni And Sourav Ganguly | Oneindia Telugu

ఢిల్లీ: గత మంగళవారం రాత్రి దుబాయ్‌ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ సారథ్యంలో ముంబై ఏకంగా ఐదుసార్లు టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలోనూ ముంబై చాంపియన్‌గా నిలిచింది. దీంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రోహిత్‌ను పరిమిత ఓవర్లలో భారత కెప్టెన్ చేయాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రోహిత్‌ కెప్టెన్సీపై స్పందించాడు.

రోహిత్ వేరేలా ఆలోచించాడు

రోహిత్ వేరేలా ఆలోచించాడు

తాజాగా ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ రోహిత్ శర్మ కెప్టెన్సీని సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీల కెప్టెన్సీతో పోల్చాడు. గంగూలీ, ధోనీ కలబోతే రోహిత్ అని పేర్కొన్నాడు. టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నపుడు గంగూలీ ఎలాగైతే బౌలర్లపై నమ్మకం ఉంచేవాడో.. రోహిత్ కూడా అలాగే తన బౌలర్లపై నమ్మకం ఉంచుతున్నాడన్నాడు. 'ఐపీఎల్ 2020 ఫైనల్లో స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను వాడుకున్న తీరు రోహిత్ క్లాస్‌కు అద్దం పడుతుంది. వేరే కెప్టెన్ ఎవరైనా సీమర్‌తో బౌలింగ్ చేయించేవాడు. కానీ రోహిత్ వేరేలా ఆలోచించాడు. అతడి ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉన్నాయో అక్కడే అర్థం అవుతోంది. అతడు బౌలర్ల కెప్టెన్' అని పఠాన్ అన్నాడు.

గంగూలీ, ధోనీ కలబోతే రోహిత్

గంగూలీ, ధోనీ కలబోతే రోహిత్

'సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ కలబోతే రోహిత్ శర్మ. ఇద్దరిలోని లక్షణాలు శర్మలో ఉన్నాయి. గంగూలీ తన బౌలర్లను నమ్మేవాడు, వారు సలహాలను పాటించేవాడు. ధోనీ కూడా తన బౌలర్లను నమ్మేవాడు కానీ.. తన మనసు మాట విని నిర్ణయాలు తీసుకునేవాడు. ఐపీఎల్ 2020 సమయంలో రోహిత్ తన వ్యూహాలను మార్చుకున్న తీరు బాగుంది. పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను వాడుకున్నాడు. ఓ మ్యాచ్‌ ప్రత్యర్థి విజయానికి చేరువగా వస్తున్నప్పుడు 17వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా చేతికి బంతిని ఇచ్చాడు. మామూలుగా 18వ ఓవర్ బుమ్రా బౌలింగ్ చేస్తాడు. కానీ ఒక ఓవర్ ముందే బుమ్రాతో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాడు' అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.

పోలార్డ్‌నుఎలా వాడాడో చూడండి

పోలార్డ్‌నుఎలా వాడాడో చూడండి

'హార్డ్ హిట్టర్ కీరన్ పోలార్డ్‌ను ముంబై కెప్టెన్ ఎలా వాడాడో చూడండి. తొలుత అతడితో బౌలింగ్ చేయించలేదు. కానీ వికెట్‌పై పేస్ ఎక్కువగా ఉన్నప్పుడు పోలార్డ్‌తో బౌలింగ్ చేయించాడు. ఇలా ఏ విషయం చూసినా.. రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు' అని మాజీ క్రికెటర్ పఠాన్ చెప్పుకొచ్చాడు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత క్రికెట్లోకి అడుగుపెట్టిన ఇర్ఫాన్ పఠాన్.. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోనూ చాలాకాలం క్రికెట్ ఆడాడు. పఠాన్ భారత్ తరఫున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. టెస్టులో ఒక సెంచరీ, హ్యాట్రిక్ తీసుకున్నాడు.

India vs Australia: ఆస్ట్రేలియా‌లో కోహ్లీకి ప్రత్యేక మర్యాదలు.. రగ్బీ లెజెండ్‌ సూట్‌లో విరాట్!!

Story first published: Friday, November 13, 2020, 9:42 [IST]
Other articles published on Nov 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X