
క్వారంటైన్‌లో ఉంటూ ప్రాక్టీస్:
క్వారంటైన్‌లో ఉన్న రెండు వారాలూ సాధన చేసుకొనేందుకు న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం భారత ఆటగాళ్లకు అనుమతి ఇచ్చింది. బయో బబుల్ వాతావరణంలో ఉంటూ.. బ్లాక్‌టౌన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పార్క్‌లో ఆటగాళ్లు శిక్షణ చేస్తారు. అక్కడికి ఎవరిని అనుమతించరు. ఇక దుబాయ్ నుంచి వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు 12 రోజుల క్వారంటైన్‌లో ఉన్నాకే.. తమ జట్టుతో కలుస్తారు. ఆ తర్వాతే వారితో కలిసి సాధన మొదలు పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం దుబాయ్ నుంచి వెళ్లిన అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు.

ప్రత్యేక మర్యాదలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో ప్రత్యేక ఆతిథ్యం ఉంటుందని అక్కడి డైలీ టెలిగ్రాఫ్ ఓ ప్రకటంలో తెలిపింది. ఈ రెండు వారాలు భారత జట్టు నగర పరిసరాల్లోని పుల్‌మ్యాన్ హోటళ్లో బస చేస్తుంది. సాధారణంగా న్యూసౌత్ వేల్స్ బ్లూస్ రగ్బీ జట్టుకు ఇదే శిబిరం. కోహ్లీసేన కోసం వారు మరో హోటల్‌కు వెళ్లారు. ఆస్ట్రేలియా రగ్బీ లెజెండ్ బ్రాడ్ ఫిట్లర్ ఎప్పుడూ బస చేసే ప్రత్యేకమైన పెంట్‌హౌజ్ సూట్‌ను కోహ్లీకి ఇవ్వనున్నారని సమాచారం. స్వల్ప సంఖ్యలో ఆటగాళ్ల కుటుంబీకులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిసింది.

ఆస్ట్రేలియా పత్రికల్లో కోహ్లీ చర్చ
ఈ పర్యటనలో భారత్, ఆస్ట్రేలియా జట్లు 3 టీ20లు, 3 వన్డేలు, 4 టెస్టులు ఆడనున్నాయి. టీ20లు, వన్డేలు ఆడనున్న విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాడు. బిడ్డకు జన్మనివ్వనున్న తన భార్య అనుష్క శర్మ చెంత ఉండేందుకు సెలవు తీసుకున్న కోహ్లీ.. మొదటి టెస్టు తర్వాత భారత్‌కు రానున్నాడు. అయితే విరాట్ కేవలం ఒక్క టెస్టు మాత్రమే ఆడనున్నాడన్నది ఆస్ట్రేలియా పత్రికల్లో చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ టెస్టు సిరీస్ పూర్తిగా ఆడకపోవడం వల్ల టెస్టు సిరీస్ ప్రసారదారు ఛానెల్ 7 నష్టపోనుందట. అదే సమయంలో పరిమిత ఓవర్ల సిరీస్‌లను ప్రసారం చేయనున్న ప్రత్యర్థి ఛానెల్ ఫాక్స్ స్పోర్ట్స్‌కు లాభించనుందట. ఈమేరకు అక్కడ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications

టీ20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్ షురూ.. ట్రోఫీ ఆవిష్కరణ!!










