న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైరల్‌ వీడియో.. సచిన్‌పై ఇమ్రాన్ బాక్సింగ్ పంచ్‌లు!!

Irfan Pathans Sons Boxing Match With Sachin Tendulkar

ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, మాజీ స్వింగ్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌ ప్రస్తుతం రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఆడుతున్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర అధికారులు ఈ టీ20 టోర్నీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టోర్నీలో భాగంగా శనివారం వాంఖేడే స్టేడియం వేదికగా ఇండియా లెజెండ్స్‌-వెస్టిండీస్‌ లెజెండ్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ విజయాన్ని అందుకుంది.

ఆమె తీవ్ర మనస్తాపం చెందింది.. ఒంటరిగా వదిలేయండి: మంధానఆమె తీవ్ర మనస్తాపం చెందింది.. ఒంటరిగా వదిలేయండి: మంధాన

 సచిన్‌పై ఇమ్రాన్ బాక్సింగ్ పంచ్‌లు:

సచిన్‌పై ఇమ్రాన్ బాక్సింగ్ పంచ్‌లు:

మ్యాచ్‌కు ఇర్ఫాన్ పఠాన్ తన కుమారుడితో పాటు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేషం చోటుచేసుకుంది. ఇర్ఫాన్‌ కుమారుడు ఇమ్రాన్‌ ఖాన్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌తో బాక్సింగ్‌ చేశాడు. ఓ టేబుల్‌పై నిల్చున్న ఇమ్రాన్.. సచిన్‌ కంటే తానే ఎత్తుగా ఉన్నానంటూ చెప్పాడు. అంతేకాదు తన కండలు చూపిస్తూ.. సచిన్‌పై బాక్సింగ్ పంచ్‌లు విసిరాడు. ఇమ్రాన్ అమాయకత్వంతో చేస్తున్న పనికి సచిన్ మురిసిపోయాడు.

 ఇమ్రాన్‌ ఏం చేశాడో తెలీదు:

ఇమ్రాన్‌ ఏం చేశాడో తెలీదు:

సచిన్‌, ఇమ్రాన్ బాక్సింగ్ పంచ్‌లకు సంబందించిన వీడియోను ఇర్ఫాన్‌ పఠాన్ ట్వీట్‌ చేశాడు. 'ఇమ్రాన్‌ ఏం చేశాడో వాడికి తెలీదు. పెద్దయ్యాక కచ్చితంగా బాక్సర్‌ అవుతాడు. సచిన్‌తో బాక్సింగ్‌ చేశాడు' అని పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ ఇర్ఫాన్‌కు రీట్వీట్‌ చేశాడు. 'చిన్నారులతో సమయాన్ని పంచుకోవడం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది. ఇమ్రాన్‌.. ఒక రోజు నీ కండలు, నా కన్నా.. మీ నాన్న కన్నా చాలా దృఢంగా ఉంటాయి' అని రాసుకొచ్చాడు.

 నవ్వులు పూయిస్తోంది:

నవ్వులు పూయిస్తోంది:

సచిన్‌, ఇమ్రాన్ బాక్సింగ్ పంచ్‌లకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ప్రతి ఒక్కరి మోహంలో నవ్వులు పూయిస్తోంది. క్రికెట్ లెజెండ్ చిన్నపిల్లాడిలా ఆ కుర్రాడితో ఆడుకోవడం అందరిని నవ్వుల్లో ముంచెత్తింది. ఇక ఫాన్స్ తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ ఇటీవలే ఆటకు వీడ్కలు పలికిన విషయం తెలిసిందే.

సెహ్వాగ్‌ వీర విహారం:

సెహ్వాగ్‌ వీర విహారం:

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ లెజెండ్స్‌ 8 వికెట్లకు 150 పరుగులు చేసింది. చందర్‌పాల్‌ (61) అర్ధ సెంచరీ సాధించాడు.లక్ష్య ఛేదనలో ఇండియా లెజెండ్స్‌ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసి నెగ్గింది. మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వీర విహారం చేశాడు. 57 బంతుల్లో 11 ఫోర్లతో అజేయంగా 74 పరుగులు చేశాడు. సచిన్‌ 29 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 83 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

Story first published: Monday, March 9, 2020, 12:48 [IST]
Other articles published on Mar 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X