న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ రికార్డు.. తొలి వికెట్‌కు 365 పరుగులు

Ireland vs West Indies : 365 Runs! John Campbell, Shai Hope Create New World Record ! || Oneindia
ireland-vs-west-indies-record-opening-stand-between-john-campbell

క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే. ఎలాంటి రికార్డు అయినా బద్దలవుతుంది. ఒకప్పుడు ఏదైనా రికార్డు నెలకొల్పితే చాలా కాలం ఉండేది. ప్రస్తుత క్రికెట్‌లో అలాంటి పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం టీ20 క్రికెట్. బ్యాట్స్‌మన్‌ టీ20 క్రికెట్‌కు అలవాటు పడడంతో.. టెస్ట్, వన్డేలను కూడా అదే తరహాలో ఆడేస్తున్నారు. దీంతో అసాధ్య రికార్డు కూడా సుసాధ్యం అవుతోంది. తాజాగా ఓ ప్రపంచ రికార్డు బద్దలైంది.

తొలి వికెట్‌కు 365 పరుగులు

తొలి వికెట్‌కు 365 పరుగులు

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఓపెనర్లు జాన్‌ క్యాంప్‌బెల్‌ (179; 137 బంతుల్లో 15×4, 6×6), షై హోప్‌ (170; 152 బంతుల్లో 22×4, 2×6) లు భారీ సెంచరీలు చేసి తొలి వికెట్‌కు 365 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డేల్లో తొలి వికెట్‌కు ఇది ప్రపంచ రికార్డు భాగస్వామ్యం. దీంతో పాకిస్థాన్‌ ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఫకార్‌ జమాన్‌ (304, జింబాబ్వేపై) నెలకొల్పిన రికార్డు బద్దలైంది.

వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం 372

వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం 372

జాన్‌ క్యాంప్‌బెల్‌, షై హోప్‌లు తొలి వికెట్‌ భాగస్వామ్య ప్రపంచ రికార్డును బద్దలు కొట్టినా.. మరో రికార్డును మాత్రం అందుకోలేకపోయారు. వన్డేల్లో నమోదైన భారీ భాగస్వామ్యం (372)ను మాత్రం బద్దలు కొట్టలేకపోయారు. 2015లో జింబాంబ్వేపై విండీస్ ఆటగాళ్లు క్రిస్ గేల్, మార్లోన్‌ శామ్యూల్స్‌లు వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు.

185 పరుగులకే ఆలౌట్

185 పరుగులకే ఆలౌట్

ఓపెనర్లు చెలరేగడంతో వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 381 భారీ పరుగులు చేసింది. ఐర్లాండ్‌ బౌలర్లలో బరీ రెండు వికెట్లు తీసాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ 34.4 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. కెవిన్‌ ఓబ్రెయిన్‌ (68) ఒక్కడే అర్ధ సెంచరీ చేసాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో నర్స్‌ నాలుగు.. గాబ్రియెల్‌ మూడు వికెట్లు తీశారు. ప్లే'యర్ ఆఫ్ డి మ్యాచ్' జాన్‌ క్యాంప్‌బెల్‌కు దక్కింది.

Story first published: Monday, May 6, 2019, 11:08 [IST]
Other articles published on May 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X