అమీతుమీ తేల్చుకోనున్న విదర్బ, ఇరానీ కప్‌ సమరం షురూ..

Posted By:
Irani Cup: Rest of India face Vidarbha ahead of IPL 2018 season

హైదరాబాద్: ఇక ఇరానీ కప్‌ కోసం పోటీ మొదలైంది. రెస్టాఫ్‌ ఆఫ్‌ ఇండియా జట్టుతో రంజీ ట్రోఫీ ఛాంపియన్‌ విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. ఐదు రోజుల ఈ మ్యాచ్‌ బుధవారం ప్రారంభంకానుంది. రంజీ ట్రోఫీలో ప్రతిభ కనబరిచిన క్రికెటర్లు ఇరానీ కప్‌లోనూ సత్తాచాటి సెలెక్టర్ల దృష్టిలో పడాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

సూపర్ ఫాంలో ఉన్న దేశవాళీ క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, నవ్‌దీప్ సైనీ మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఐదురోజుల పాటు (మార్చి 14-18) ఇక్కడ జరుగనున్న ఇరానీ ట్రోఫీలో రంజీ చాంపియన్ విదర్భతో రెస్టాఫ్ ఇండియా తలపడుతుంది. భారత వన్డే జట్టులో తిరిగి చోటు దక్కించుకోవాలని ఆరాటపడుతున్న సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్‌ను సరైన వేదికగా వాడుకోవాలని చూస్తున్నాడు.

మరోవైపు రంజీ చాంపియన్ విదర్భలో కెప్టెన్ ఫజల్, వసీం జాఫర్, రజ్‌నీష్ గుర్బానీ మునుపటి ఫాంను కనబరిచి ఇరానీకప్‌ను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఐపీఎల్ తర్వాత భారత ఏ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నది. దీంతో ఇరానీకప్‌లో ప్రతిభ కనబరిచి భారత్ ఏ జట్టులో చోటు సంపాదించాలని దేశవాళీ కుర్రాళ్లు తహతహలాడుతున్నారు.

జట్లు:రెస్టాఫ్ ఇండియా: కరుణ్(కెప్టెన్), ఈశ్వరన్, పృథ్వీషా, సమర్థ్, అగర్వాల్, విహారీ, భరత్, అశ్విన్, జయంత్, నదీమ్, రాజ్‌పుత్, సైనీ, సేథ్
విదర్భ: ఫజల్ (కెప్టెన్), సతీష్, సంజయ్, జాఫర్, వాంఖడే, వాడ్కర్, సిద్ధేశ్, కర్ణ్, వాఖరే, ఉమేశ్, గుర్బానీ, యాష్, థాకరే, అథర్వ

Story first published: Wednesday, March 14, 2018, 12:32 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి