న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టుకు బలహీనతగా మారిన కెప్టెన్ రోహిత్ శర్మ

IPL18: Rohit Sharmas main role in eliminating Mumbai, how do you know?

హైదరాబాద్: ముంబై ఆశలు.. ఆవిరైపోయాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఆది నుంచి పేలవ ప్రదర్శనను కొనసాగించింది. ద్వితీయార్థంలో కాస్త పుంజుకున్నా ముగింపు మ్యాచ్‌లో చతికిలబడటంతో ప్లేఆఫ్‌కు దూరమైంది. ఈ క్రమంలో మంగళవారం నుంచి ప్లేఆఫ్స్‌ ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాయి.

కెప్టెన్‌యే జట్టు బలహీనంగా మారాడు:

కెప్టెన్‌యే జట్టు బలహీనంగా మారాడు:

ఆఖరి మ్యాచ్ వరకు ప్రతి ఐపీఎల్‌ సీజన్‌లో 300 పరుగులకుపైగా చేసిన ఆటగాళ్లుగా రోహిత్‌ శర్మ, సురేశ్‌ రైనా పేరిట రికార్డు ఉండేది. ఆదివారం మ్యాచ్‌లో కూడా రోహిత్‌ (13 పరుగులు మాత్రమే చేశాడు) అంతగా రాణించకపోవడంతో అతను 300 పరుగుల మార్కును అందుకోలేకపోయాడు.

రైనా.. ఏకైక ఆటగాడిగా నిలువగా.:

రైనా.. ఏకైక ఆటగాడిగా నిలువగా.:

చెన్నై తరఫున ఆడుతున్న రైనా.. ఇప్పటికే 300లకుపైగా పరుగులు చేశాడు. దీంతో మొత్తం 11 ఐపీఎల్‌ సీజన్‌లలోనూ 300 పరుగులకుపైగా చేసిన ఏకైక ఆటగాడిగా నిలువగా.. రోహిత్‌ ఆ రికార్డును అందుకోలేకపోయాడు. అంతేకాకుండా ప్రస్తుత సీజన్‌లో 300 మార్కును అందుకోలేకపోయిన ఆటగాడిగా చెత్త రికార్డును కూడా రోహిత్‌ మూటగట్టుకున్నాడు.

ఢిల్లీ పోతూపోతూ.. ముంబైను కూడా

ఢిల్లీ పోతూపోతూ.. ముంబైను కూడా

ఢిల్లీ పోతూపోతూ.. ముంబైను కూడా ప్లేఆఫ్ నుంచి తప్పించింది. చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో ముంబై 175 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక.. 11 పరుగులతో తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ముంబై జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఇక, ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆటతీరు మరీ దారుణమని చెప్పాలి.

రోహిత్‌ శర్మ కేవలం 286

రోహిత్‌ శర్మ కేవలం 286

రోహిత్‌ శర్మ ఇప్పటివరకు 11 ఐపీఎల్‌ సిరీస్‌లు ఆడగా.. అందులో పది సీజన్‌లలోనూ 300కుపైగా పరుగులు చేశాడు. తాజా పదకొండో సీజన్‌లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో దాదాపు అన్ని మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు.

Story first published: Monday, May 21, 2018, 11:44 [IST]
Other articles published on May 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X