న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాజీల ఆగ్రహం.. ధోనీకి మైదానంలోకి వెళ్లే హక్కు లేదు

IPL 2019 : Twitter Slams MS Dhoni About Angry On Umpires || Oneindia Telugu
IPL Umpires decision: Michael Vaughan, Akash Chopra among several former cricketers to slam MS Dhoni

గురువారం రాత్రి రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంపైర్లతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై పెద్ద చర్చే జరుగుతోంది. పలువురు మాజీలు అయితే ధోనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీకి మైదానంలోకి వెళ్లే హక్కు ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తున్నారు.

 ధోనీ అవుట్:

ధోనీ అవుట్:

చివరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం. చివరి ఓవర్ అందుకున్న స్టోక్స్‌.. తొలి బంతిని ఆఫ్‌స్టంప్‌ ఆవల వేయగా జడేజా సిక్స్ బాదాడు. తర్వాత బంతిని స్టోక్స్‌ నోబాల్‌ వేయగా.. జడేజా సింగిల్‌ తీశాడు. ఫ్రీ హిట్‌కు ధోనీ రెండు పరుగులు తీశాడు. కానీ తర్వాతి బంతిని స్టోక్స్‌ యార్కర్‌ వేయగా ధోనీ బౌల్డయ్యాడు. దీంతో చెన్నై సమీకరణం చివరి మూడు బంతుల్లో 8 పరుగులకు మారింది.

అంపైర్లతో వాదన:

అంపైర్లతో వాదన:

నాలుగో బంతిని స్టోక్స్‌.. శాంట్నర్‌కు నడుంపైకి వేసాడు. దీంతో ప్రధాన అంపైర్‌ హైట్‌ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే లెగ్‌ అంపైర్‌ కాదనడంతో.. ప్రధాన అంపైర్‌ వెంటనే చేతిని దించేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. క్రీజులో ఉన్న జడేజా అభ్యంతరం వ్యక్తం చేస్తుండగానే.. కెప్టెన్ ధోనీ ఆవేశంగా మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాదనకు దిగాడు. కొద్దిసేపు అంపైర్లు, ధోనీ మధ్య వాదన నడిచింది. ఈ క్రమంలో ధోనీ ఎంత వాదించినా.. అంపైర్లు అది నోబాల్‌ కాదనడంతో చేసేదేమీలేక తిరిగి డగౌట్‌కు వెళ్ళిపోయాడు.

ధోనీపై మాజీల ఆగ్రహం:

ఆవేశంగా మైదానంలోకి దూసుకొచ్చేయడంతో.. పలువురు మాజీలు ధోనీపై ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసింది. 'ధోనీ నేరుగా మైదానంలోకి వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేసింది. డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లు మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాదించడం సరైంది కాదు' అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ వైఖెల్‌ వాన్‌ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

'ఐపీఎల్ మ్యాచ్‌లలో అంపైరింగ్‌ ప్రమాణాలు సరిగా లేవు. మొదటగా నోబాల్‌ ఇచ్చి.. వెనక్కు తీసుకోవడం అంపైర్ల తప్పే. ఏదైనా కానీ ధోనీకి మైదానంలోకి వెళ్లే హక్కు లేదు' అని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు. మరోవైపు అభిమానులు కూడా ధోనీపై విమర్శలు చేస్తున్నారు.

Story first published: Friday, April 12, 2019, 13:27 [IST]
Other articles published on Apr 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X