న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకం మొదలైంది

IPL Tickets 2018 Online Booking: Book IPL 11 Tickets

హైదరాబాద్: దేశీవాళీ క్రికెట్లలోనే ఐపీఎల్‌కి ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. అత్యంత ఖరీదైన ఐపీఎల్‌కు అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడుకునే వేళైంది. జనవరి 27, 28తేదీల్లో జరిగిన వేలంలో భారీ మొత్తంలో వెచ్చించి ఆటగాళ్లును కొనుగోలు చేశాయి 8 ఫ్రాంచైజీలు. అంతేగాక భారీ ఏర్పాట్లుతో సిద్ధమైన ఫ్రాంచైజీలు టికెట్లను విక్రయించేందుకు సిద్ధమైయ్యాయి. ఏప్రిల్ 7నుంచి ముంబై వేదికగా మొదలుకాబోతున్న మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్ల అమ్మకాలకు కౌంటర్లు తెరచినట్లు ముంబై ఫ్రాంఛైజీ ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఆన్‌లైన్లో www.mumbaiindians.com ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చని మీడియాకు వెల్లడించింది. టిక్కెట్ల ధరలు కనిష్ఠంగా రూ.800 నుంచి గరిష్ఠంగా 8,000 మధ్య వివిధ స్థాయిల్లో ఉన్నాయి. సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్‌ల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

ఏప్రిల్ 14న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్ టిక్కెట్లను రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా అందరికీ విద్య-అందరికీ క్రీడలు ఉద్దేశంతో అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ కోసం రిజర్వ్ చేసినట్లు పేర్కొంది. గతేడాది లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ను ఓడించి రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై జట్టు టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

ముంబై ఇండియన్స్‌తో పాటుగా మిగిలిన ఏడు జట్లు ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టాయి. టిక్కెట్ల కోసం ఆయా ఫ్రాంచైజీల వెబ్‌సైట్ల అడ్రస్‌లు ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ ఐపీఎల్ ప్రసార హక్కులు, టిక్కెట్ల అమ్మకాలు మొత్తం కలిపి బీసీసీఐ గతేడాది వార్షిక ఆదాయం రూ.2 వేల కోట్లు దాటింది. ఇంత మొత్తంలో ఆదాయం వచ్చేందుకు ఐదేళ్లపాటు ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ ఇండియా రూ.16,347కోట్లను బోర్డుకు చెల్లించనుంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో బోర్డు ఆదాయం గణనీయంగా పెరగనుంది.

Story first published: Friday, March 16, 2018, 14:49 [IST]
Other articles published on Mar 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X