భారత క్రికెటర్‌పై నిషేధం ఎత్తివేత.. ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడేందుకు బీసీసీఐ అనుమతి!!

IPL స్పాట్‌ ఫిక్సింగ్‌.. Ankeet Chavan's నిషేధం ఎత్తివేత| Sreesanth| Mumbai Spinner| Oneindia Telugu

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2013 సీజన్లో స్పాట్‌ ఫిక్సింగ్‌లో దోషిగా తేలి జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న భారత దేశవాళీ క్రికెటర్‌ అంకిత్‌ చవాన్‌కు భారీ ఊరట లభించింది. ముంబై మాజీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన అంకిత్‌ చవాన్‌పై ఉన్న నిషేధాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ఎత్తివేసింది. బీసీసీఐ నిషేధం ఎత్తివేయడంతో ఇకపై ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడేందుకు అతడికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లయింది. నిషేధం ముగియడంతో మైదానానికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తున్నట్టు చవాన్‌ తెలిపాడు. కరోనా వైరస్ మహమ్మారి, వర్షాల కారణంగా మైదానంకు వెళ్లలేకపోతున్నానని పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2013లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో భారత వెటరన్ క్రికెటర్‌ ఎస్ శ్రీశాంత్‌తో పాటు అంకిత్‌ చవాన్‌పై బీసీసీఐ శాశ్వత నిషేధం విధించింది. శ్రీశాంత్‌ కోర్టుల చుట్టూ తిరిగి నిర్దోషినని నిరూపించుకొనే ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి కోర్టుల సూచనతో పాటు స్వయంగా విచారించిన అంబుడ్స్‌మన్‌ అతడిపై నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించారు. 2020 సెప్టెంబర్లోనే అతడి నిషేధం ముగిసింది. ఆపై శ్రీశాంత్‌ దేశవాళీ టోర్నీ ఆడాడు. తన పదునైన బంతులతో వికెట్లు కూడా పడగొట్టాడు. ఐపీఎల్ 2021 కోసం అప్లై చేసుకున్నా.. నిరాశ తప్పలేదు.

ICC Test Rankings: మళ్లీ అగ్రస్థానానికి స్మిత్..నాలుగో ర్యాంకులో కోహ్లీ!యాష్‌ మినహా మరెవ్వరూ లేరు!ICC Test Rankings: మళ్లీ అగ్రస్థానానికి స్మిత్..నాలుగో ర్యాంకులో కోహ్లీ!యాష్‌ మినహా మరెవ్వరూ లేరు!

అంకిత్‌ చవాన్‌ శిక్షాకాలం కూడా అప్పుడే పూర్తిచేసుకున్నా.. ఉత్తర్వులు ఇవ్వలేదు. మంగళవారం రాత్రి అవి అందడంతో అతడు ఆనందం వ్యక్తం చేశాడు. '2020 సెప్టెంబర్‌కే నిషేధం ముగిసింది. నాకు లభించే ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటా. వీలైనంత త్వరగా మైదానంలో అడుగుపెట్టాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. దురదృష్టవశాత్తు కరోనా వైరస్, వర్షాల వల్ల మైదానాలు మూసేశారు. అయితే ఏ అవకాశం వచ్చినా అస్సలు వదలను' అని అంకిత్‌ చవాన్‌ తెలిపాడు. చవాన్‌ ఇప్పటివరకు టీమిండియాకు ఆడలేదు.

అంకిత్‌ చవాన్‌కు బీసీసీఐ తాత్కాలిక సీఈవో హేమంగ్‌ అమిన్‌ నుంచి ఈమెయిల్‌ అందింది. 'బాంబే హైకోర్టు ఉత్తర్వుల మేరకు మీ నిషేధ ఆర్డర్‌ను బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ ముందు ఉంచాము. మీపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఆయన ఏడేళ్లకు తగ్గించారు. 2013 సెప్టెంబర్‌ 13 నుంచే ఇది వర్తిస్తుంది. 2020 సెప్టెంబర్‌13తో మీపై నిషేధం ముగిసింది' అని అందులో వివరించారు. గతేడాది సెప్టెంబర్లోనే శిక్ష ముగిసినా.. బీసీసీఐ నుంచి క్లియరెన్స్‌ రాకపోవడంతో జోక్యం చేసుకోవాలని ముంబై క్రికెట్‌ సంఘానికి అంకిత్‌ విజ్ఞప్తి చేశాడు. చవాన్‌ తన కెరీర్‌లో 7 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 15 లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, June 16, 2021, 18:27 [IST]
Other articles published on Jun 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X